ప్రభుదేవా గులేబకావళి

  • IndiaGlitz, [Thursday,March 01 2018]

ప్రముఖ నటుడు, దర్శకుడు, నృత్య దర్శకుడు ప్రభుదేవా హీరోగా, హాన్సిక హీరోయిన్‌గా, ప్రముఖ నటి రేవతి ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించిన తమిళ చిత్రం గులేబకావళి. కల్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కోలీవుడ్‌లో సంక్రాంతికి విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా ఇప్పుడు ఈ చిత్రాన్ని అదే పేరుతో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రవైట్ లిమిటెడ్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులోకి అనువదిస్తున్నారు.

మార్చి 16న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం విశేషాలను ఆయన తెలియజేస్తూ తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే విశ్వాసంతో తెలుగులోకి అనువదిస్తున్నాను. గులేబకావళి అనే గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. పూర్తి వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా వుంటుంది.

ఇండియాన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా నృత్యాలు, నటన ప్రధాన హైలైట్‌గా వుంటుంది. మార్చి 16న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. ప్రభుదేవా, హాన్సిక, రేవతి, మన్సూర్ అలీఖాన్, మధు, ఆనంద్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టంట్స్: పీటర్ హెయిన్స్, సంగీతం: వివేక్ మెర్విన్, కెమెరా: ఆర్‌ఎస్ ఆనంద్‌కుమార్, ఆర్ట్: కదీర్, పాటలు: సామ్రాట్, దర్వకత్వం: కల్యాణ్, నిర్మాత: మల్కాపురం శివకుమార్.

More News

హైదరాబాద్ లో అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' కీలక సన్నివేశాల చిత్రీకరణ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,అను ఇమ్మాన్యుయేల్ జంట గా వక్కంతం వంశీ దర్శకుడిగా

ఈ ఏడాది ఆ ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు లేనట్టేనా?

గతేడాది..టాలీవుడ్ కు మంచి విజయాలను అందించిన కథానాయకులలో చిరంజీవి,ప్రభాస్,ఎన్టీఆర్ లను ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

నాగార్జున కెరీర్‌లో మ‌రో స్పెష‌ల్ మూవీ అవుతుందా?

నాగార్జున కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిన చిత్రాలలో అన్న‌మ‌య్య‌, మ‌నం త‌ప్ప‌కుండా ఉంటాయి. ఈ రెండు చిత్రాల‌కి ఓ ప్ర‌త్యేకత ఉంది. అదేమిటంటే.. ఆయా సినిమాలు మే నెలాఖ‌రులో విడుద‌ల‌వ‌డం.

రాజ‌మౌళితో మొద‌లుపెడుతున్న రామ్ చ‌ర‌ణ్‌

క‌థానాయ‌కుడిగా రామ్ చ‌ర‌ణ్ కెరీర్ మొద‌లై ప‌దేళ్ళు దాటింది. ఈ ప‌దేళ్ళ కాలంలో హీరోగా ప‌ది సినిమాలతో సంద‌డి చేశాడు చ‌ర‌ణ్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 11 వ చిత్రం రంగ‌స్థ‌లం.. మార్చి 30న విడుద‌ల కానుంది.

మహేష్ అన్న తనయుడు సినిమాల్లోకి...

సూపర్ స్టార్ కృష్ణ తనయుడు సూపర్ స్టార్ మహేష్ సినిమాల్లో టాప్ స్టార్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే.