మజ్ను రిలీజ్ కు ముహుర్తం కుదిరింది..
Tuesday, August 2, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని హీరో ఉయ్యలా జంపాలా ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి మజ్ను అనే టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఆనంది ఆర్ట్స్ & కేవా మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, గోపీసుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మజ్ను ఈనెల 2 నుంచి తాజా షెడ్యూల్ ను అరకులో జరుపుకుంటుంది. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 17న రిలీజ్ చేయనున్నారు. భలే భలే మగాడివోయ్, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, జెంటిల్ మన్ చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన నాని మజ్ను చిత్రంతో సెకండ్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుడతాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments