చెస్ కింగ్‌... బ‌యోపిక్‌కి రంగం సిద్ధం

  • IndiaGlitz, [Monday,December 14 2020]

ఇండియ‌న్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై బ‌యోపిక్స్ ట్రెండ్ ఇప్ప‌ట్లో త‌గ్గేలా లేదు. ప‌లు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల బ‌యోపిక్స్ విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన‌వే. క్రీడా రంగం విష‌యానికి వ‌స్తే ధోని, స‌చిన్ టెండ్కూల‌ర్, అజారుద్దీన్‌, మేరీకోమ్, మిల్కాసింగ్‌ వంటి క్రీడాకారుల బ‌యోపిక్‌తో పాటు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు వంటి మ‌రికొంత మంది బ‌యోపిక్స్ రూపొందుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో మ‌రో బ‌యోపిక్ కూడా చేరింది. వివ‌రాల్లోకెళ్తే.. చెస్ రారాజు ఎవ‌రు? అని మ‌న ఇండియ‌న్స్‌ను అడిగితే మ‌న‌కు వెంట‌నే గుర్తుకు వ‌చ్చే పేరు విశ్వ‌నాథ‌న్ ఆనంద్‌. ఈయ‌న బ‌యోపిక్‌ను ప్ర‌ముఖ దర్శ‌క నిర్మాత ఆనంద్ ఎల్‌.రాయ్ తెర‌కెక్కించ‌నున్నారు.

విశ్వ‌నాథ‌న్ ఆనంద్ చిన్న‌ప్ప‌టి నుండి ఇండియాలో నెంబ‌ర్ వ‌న్ గ్రాండ్ మాస్ట‌ర్‌గా ఎదగ‌డ‌మే కాకుండా, ప్ర‌పంచ చెస్ ఛాంపియ‌న్‌గా ఎలా మారాడు? అనే అంశాల‌తో ఈ బ‌యోపిక్ రూపొంద‌నుంది. 2021 ప్ర‌థ‌మార్థంలో సెట్స్‌పైకి వెళ్ల‌నున్న ఈ బ‌యోపిక్‌లో న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల గురించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. 'జీరో'త‌ర్వాత 'అత్రంగిరే' సినిమాను తెర‌కెక్కిస్తున్న ద‌ర్శ‌కుడు ఆనంద్ ఎల్‌.రాయ్ డైరెక్ట్ చేయ‌నున్న ఈ సినిమాలో మ‌రి విశ్వనాథ‌న్ ఆనంద్‌గా ఎవ‌రు న‌టిస్తారు? అనేది ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

More News

లింగ వివ‌క్ష‌గురించి సాయిప‌ల్ల‌వి సెన్సేష‌న‌ల్ కామెంట్స్‌

స్త్రీ, పురుషుల స‌మాన‌త్వం గురించి హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది.

మోనాల్ ఎలిమినేట్.. అఖిల్ ఏదో చెబుతాడట..

‘దడ పుట్టిస్తా నీకు.. దడ పుట్టిస్తా..’ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఇవాళ ఫైనలిస్టులు ముగ్గురు ఎవరో తెలియబోతోంది.

‘తలైవి’ షూటింగ్ కంప్లీట్.. కంగన భావోద్వేగ పోస్ట్..

బాలీవుడ్ స్టార్‌ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’.

వెంకటేష్ బర్త్‌డే కానుకగా.. ‘ఎఫ్ 3’ అధికారిక ప్రకటన..

విక్టరీ వెంకటేష్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోలుగా రూపొందిన చిత్రం ‘ఎఫ్2’. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది.

దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా.. నిన్న కొత్తగా..

భారత్‌లో కరోనా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య కూడా బాగానే తగ్గింది.