close
Choose your channels

ఆల్ ఇండియా ఎంప్లాయిస్ కాన్ ఫెడరేషన్ వేడుక

Sunday, May 29, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆల్ ఇండియా ఫిలిం ఎంప్లాయిస్ కాన్ ఫెడరేషన్ వేడుక శనివారం హైదరాబాద్ లో జరగింది. ఈ వేడుకలకు కేంద్ర కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ, దర్శకరత్న డా.దాసరి నారాయణరావు, తెలంగాణ సినిమాటోగ్రాఫర్ మినిష్టర్ తలసాని శ్రీనివాస యాదవ్, మెగాస్టార్ చిరంజీవి, మా అధ్యక్షుడు డా.రాజేంద్రప్రసాద్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కాదంబరి కిరణ్, కొమరం వెంకటేష్ అధ్వర్యంలో ఈ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా....

కేంద్ర కార్మికశాఖా మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ `సినిమా రంగంలోని కార్మికులకు ఉన్న ఇబ్బందులు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి ఓ కమిటీని వేసి వచ్చే ఫీడ్ బ్యాక్ తో ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తాం`` అన్నారు.

తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ `భాష లు వేరైనా కార్మికుల శ్రేయస్సు కు ఈ మీటింగ్ ఉపయోగ పడుతుంది.. అక్కినేని, దాసరి తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ లో స్థిర పడేందుకు కృషి చేసారు. చిత్రపురి కాలని శుభాపరిణామం. ఆన్ లైన్ టిక్కెట్ కోసం, సింగల్ విండో పాలసీ కోసం కృషి చేస్తున్నాం. హైదరాబాద్ లో ఉన్న షూటింగ్ ఫెసిలిటీస్ ఇండియా లో ఎక్కడా లేవు. చిత్రపురి కాలనీ లో వసతులు ఒక్కటిగా ఏర్పాటు చేస్తున్నాం. మా అసోసియేషన్ కు సహకారం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుంది. వృద్ద కళాకారులు పెన్షన్ ప్రభుత్వం ఇచ్చే ఆలోచనలో ఉంది. పెన్షన్, కళ్యాణ లక్ష్మి, రేషన్ పథకాలు సినీ కార్మికుల కు అందుతాయి`` అన్నారు.

దర్శకరత్న డా.దాసరి నారాయణరావు మాట్లాడుతూ `ఇండియా లో ఎక్కడ లేని విధంగా చిత్రపురి కాలనీ నిర్మించుకున్నాం..మాటల ముఖ్యమంత్రి కాదు చేతల ముఖ్యమంత్రి మాకు ఉన్నారు. ప్రతి కార్మికుడు కు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. అదే మా విన్నపం`` అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ `యావత్ భారతదేశం లోని కార్మిక నాయకులు ఇక్కడ సమావేశం అవడం చాలా ఆనందంగా ఉంది. సినీ పరిశ్రమ పై కెసిఆర్ గారికి ప్రత్యేక శ్రద్ద ఉంది. ఇండస్ట్రీ సుస్థిరం కోసం ముఖ్యమంత్రి గారు సలహాలు అడిగారు. హైదరాబాద్ లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఎక్కడ లేని విధంగా ఇక్కడ చిత్రపురి కాలనీ ఉంది. సినిమా పరిశ్రమ మీద నాకు ఏంతో కృతఙ్నత ఉంది. అర్హత కు మించి గౌరవం ఇచ్చింది`` అన్నారు.

మా అధ్యక్షుడు డా.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ `సినిమా కు లాంగ్వేజ్ లేదు, షూటింగ్ కి ముందు తర్వాత కూడ వర్క్ చేసేది వర్కర్స్. 25 ఇయర్స్ ముందు మేము చేసింది ఇప్పుడు హిందీ లో ట్రెండ్ అయ్యింది`` అన్నారు.

మాగంటి బాబు మాట్లాడుతూ `తెలంగాణ లో మొట్ట మొదటి సమావేశం జరగడం చాలా ఆనందం గా ఉంది. సినీ కార్మికుల విషయం లో మా ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇండస్ట్రీ అభివృద్ధి లో సపోర్ట్ గా ఉంటాం`` అన్నారు

సి.కళ్యాణ్ మాట్లాడుతూ `కమిటీ లో మాట్లాడినవి నెరవేర్చాలి, సినిమా ఇండస్ట్రీ కి నిజంగా ఇండస్ట్రీ కి హోదా లేదు. ఇండియా లొనే హైదరాబాద్ చాలా పెద్ద హబ్ అవుతుంది. వర్కర్స్ కి పెన్షన్ వచ్చేలా చేయాలి. తమిళనాడు లో అజెడ్ వర్కర్స్ కి ఫైవ్ స్టార్ సౌకర్యాలు ఇప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి`` అన్నారు

ఎన్.,శంకర్ మాట్లాడుతూ `హైదరాబాద్ ప్రపంచ సినిమాకి హబ్ గా మార్చే ప్లాన్ తో రమ్మని cm కెసిఆర్ గారు అన్నారు, ఆలా జరుగుతుంది అని నమ్ముతున్నాను`` అన్నారు.

కొడాలి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ `నందమూరి జయంతి రోజు ఈ సమావేశం జరగడం చాలా సంతోషకరం. ఇండస్ట్రీ లో ఏ సమస్య వచ్చినా మాకు పెద్ద దిక్కు దాసరి నారాయణ రావు గారే. ఏ ప్రొడ్యూసర్ కూడా కార్మికులు కాకుండా కాపాడింది దాసరి గారే. అయన చాల పధకాలు ఏర్పాటు చేసిన దాసరి మాకు మార్గదర్శి`` అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment