జనసేనాని గెలుపు పై రాష్ట్రమంతా ఉత్కంఠ
Send us your feedback to audioarticles@vaarta.com
జనసెనాని పవన్ కళ్యాణ్ వైపు గెలుపు పవనాలు వీస్తాయా? లేదా?... విశాఖ జిల్లా గాజువాక నియోజక వర్గం నుంచి పవన్ గెలుస్తారా? లేదా?... వైసీపీ అభ్యర్థి తిప్పలు నాగిరెడ్డికి ఉన్న సానుభూతి, టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస రావు చేసిన అభివృద్ధి పనులు వారి విజయానికి ప్లస్ అవుతుండగా... జనసేనని ఏ మేరకు నెగ్గుకొస్తారు అనే విషయం చర్చనీయంగా మారింది.
పవన్ కళ్యాణ్ కు టీడీపీ అభ్యర్థి నుంచే గట్టి పోటీ ఎదురవుతుంది అని అందరూ అనుకున్నా... అనూహ్యంగా వైసీపీ అభ్యర్థి సైతం తనదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకున్నారు. వయసు మీద పడుతుండడంతో తను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదని... ఈ సారి తనకు ప్రజా సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని ప్రచారం చేసి సక్సెస్ అయ్యాడు. మరో వైపు ఎన్నికలకు మూడు రోజుల మందునుండే వైసీపీ కార్యకర్తలు చేసిన ప్రచారం.. పంచిన తాయిలాలు కూడా వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి ఓటు బ్యాంక్ పెరిగేందుకు కారణం అవుతాయి అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇక టీడీపీ అభ్యర్థి పల్లా ... తాను చేసిన అభివృద్ధి పనులే తనకు ఓట్లు వేయిస్తాయని నమ్ముతున్నారు. కాగా... పవన్ గాజువాక భాహిరంగ సభ రద్దు కావడం, అనారోగ్య కారణాల వల్ల నియాజక వర్గంలో ప్రచారం సరిగ్గా చేయక పోవడం మైనస్ పాయింట్స్ అవుతాయి ఏమో అనే చర్చ నడుస్తోంది. పోలింగ్ రోజు ఈవీఎంల మోరయింపు వల్ల కూడా పవన్ కు కాస్త నష్టమే జరిగింది అంటున్నారు.
పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న జనసేనాని అభిమానులు ... ఈవీఎం లు సరిగ్గా పనిచేయక పోవడం తో వెయిట్ చేసి చేసి ఓటు వేయకుండా వెనక్కి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కానీ ... గంగవరం, కుర్మన్న పాలెం, మింది, అగనంపుడి, దువ్వాడ, వడ్లపుడి తదితర ప్రాంతాల నుంచి పవన్ కు పూర్తి మద్దతు ఉంది. మరి గాజువాక నుంచి పవన్ విజయ దుందుభి మోగిస్తారో లేదో తెలియాలి అంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout