‘మా’ నరేష్‌ను చిరంజీవి ఏం చేయబోతున్నారు!?
Send us your feedback to audioarticles@vaarta.com
మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షుడు నరేష్‌ను క్రమ శిక్షణా సంఘం ఏం చేయబోతోంది..? ఆయన్ను తప్పించాలని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నారా..? ఎన్నికను రద్దు చేసి మరోసారి అధ్యక్ష పదవికి ఎన్నిక జరపాలనే యోచనలు పెద్దలున్నారా..? నరేష్‌పై ‘మా’ సభ్యుల తిరుగుబాటు వెనుక ఆంతర్యమదేనా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతోంది.
మళ్లీ మళ్లీ వివాదాల్లోకి!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ మొదలైన సంగతి తెలిసిందే. ఎన్నికలు జరిగి నరేష్ ప్యానెల్ గెలిచిన నాటి నుంచి ‘మా’ చేసే మంచి పనులు, తీసుకునే నిర్ణయాలు దేవుడెరుగు కానీ.. గొడవలకు మాత్రం కొదువ లేకుండా పోయింది. ఇప్పటికే మీడియా ముందుకొచ్చి ఎవరికిష్టం వచ్చినట్లుగా వాళ్లు రచ్చ రచ్చ చేసేశారు. అంతేకాదు.. టాలీవుడ్ పెద్దల ముందు కూడా గొడవపడి ‘మా’ పరువును బజారున కలిపేశారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా మరోసారి ఈ ‘మా’ వివాదాలతో వార్తల్లో నిలిచింది.
సభ్యులు కన్నెర్ర!
‘మా’ అధ్యక్షుడు నరేష్‌పై ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అసోసియేషన్‌కు చెందిన నిధులను ఆయన దుర్వినియోగం చేస్తున్నారని నరేష్‌పై ఆరోపణలు వస్తున్నాయ్. చేసిందంతా నరేష్ చేసి.. మాజీ అధ్యక్షుడు శివాజీరాజాపై తప్పుడు ఆరోపణలు చేశారని సభ్యులు మండిపడుతున్నారు. మరోవైపు.. నరేష్ తమను అవమానిస్తున్నారని ఈసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరేష్ తప్పులపై క్రమశిక్షణ సంఘానికి పలువురు ఈసీ సభ్యులు లేఖ రాయడంతో మరోసారి ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. నిబంధనలు ఉల్లంఘించిన నరేష్‌పై చర్యలు తీసుకోవాలని లేఖలో సభ్యులు కోరారు. మొత్తం తొమ్మిది పేజీల లేఖను సంఘానికి సభ్యులు పంపారు.
భ్రష్టుపట్టిస్తున్న నరేష్!
ఈ మొత్తం వ్యవహారంపై జీవిత రాజశేఖర్ స్పందిస్తూ.. నరేష్ నిర్ణయాలతో 'మా' పూర్తిగా భ్రష్టుపట్టి పోతోందని ఆమె కన్నెర్రజేశారు. అంతేకాదు.. 'మా' సభ్యులు ఆస్పత్రిలో ఉంటే కనీసం నరేష్.. పరామర్శించలేదని జీవిత మండిపడుతున్నారు. మొత్తానికి చూస్తే మరోసారి ‘మా’లో గొడవలు రేగుతున్నాయ్.. మరి ఈ వివాదం ఎంతవరకూ వెళ్తుందో..? టాలీవుడ్ పెద్దలు జోక్యం చేసుకుని ఈసారి కూడా సర్ది చెప్పి పంపుతారో లేకుంటే.. మళ్లీ మళ్లీ వార్తల్లో ఇలా వివాదాలతో ‘మా’ నిలుస్తుంటే చూస్తూ మిన్నకుండిపోతారో వేచి చూడాల్సిందే.!
చిరంజీవి ఏం చేయబోతున్నారు!?
మా అసోసియేషన్ కార్యవర్గం క్రమశిక్షణ సంఘాన్ని ఆశ్రయించింది. క్రమ శిక్షణా సంఘం సభ్యులుగా కృష్ణంరాజు, మురళీమోహన్, చిరంజీవి, మోహన్‌బాబులు ఉన్నారు. క్రమ శిక్షణా సంఘం స్పందనను బట్టి తమ నిర్ణయం ఉంటుందని ‘మా’ కార్యవర్గ సభ్యులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో చిరంజీవి ఏం చేయబోతున్నారు..? ‘మా’ ఎన్నికను రద్దు చేస్తారా..? లేకుంటే కంటిన్యూ చేస్తూ.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారా..? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout