చరణ్ కోసం కసరత్తులు

  • IndiaGlitz, [Saturday,February 03 2018]

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఇటీవల మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో కొన్ని భావోద్వేగ సన్నివేశాల్ని సీనియర్ నటి స్నేహాపై చిత్రీకరించారు. ఇక ఈ నెల నుంచి జరిగే రెండో షెడ్యూల్ లో చరణ్ కూడా పాల్గొననున్నారు.

ఈ సినిమాలో చరణ్ పాత్రని ఇటు మాస్, అటు క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు తీర్చిదిద్దుతున్నారని సమాచారం. గత చిత్రం సరైనోడు'లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని కొత్తగా చూపించిన బోయపాటి.. ఈ చిత్రంలో కూడా చరణ్ కోసం ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం...ఈ సినిమా చిత్రీకరణని వేసవి కల్లా పూర్తి చేసి, జూలై నెలలో విడుదల చేయడానికి బోయపాటి ప్లాన్ చేస్తున్నారట. ఇక దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాలో చరణ్‌కు అన్న పాత్రలో తమిళ నటుడు ప్రశాంత్ నటిస్తున్నారు.

More News

మహిళలతో సినిమా చూడనున్న 'భాగమతి'

క్వీన్ ఆఫ్ టాలీవుడ్ అనుష్క ముఖ్య పాత్రలో తెరకెక్కించిన భాగమతి చిత్రం

'హ్యాపీ వెడ్డింగ్' షూటింగ్ పూర్తి

ఇటీవలే క్వీన్ ఆఫ్ టాలీవుడ్ అనుష్కతో భాగమతి లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ ని సాధించిన యువి క్రియేషన్స్

చివరి షెడ్యూల్ లో 'సత్య గ్యాంగ్'

సాత్విక ఈశ్వర్ ని హీరోగా పరిచయం చేస్తూ..

ఫస్ట్ కాపీతో ఈ నెలలోనే విడుదలకు సిద్ధమైన గుడ్ బ్యాడ్ అగ్లీ

గుడ్ అంటే మంచి,బ్యాడ్ అంటే చెడు,అగ్లీ అంటే తింగరితనం ఈ పదాలు మనకు తెలిసినవే.

కోటి హృదయాలను మీటిన పాట...నీకు నాకు మధ్య ఏదో ఉంది...

నిత్యం ఎన్నో రాగాలు, మరెన్నో పాటలు మనం వింటూనే ఉంటాం.