Pemmasani:అవినీతి సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుతుంది: పెమ్మసాని
Send us your feedback to audioarticles@vaarta.com
ఐదేళ్లు జనం మొహం చూడకుండా పాలించిన ఏకైక సీఎంగా జగన్ నిలిచిపోతారని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెనాలి నియోజకవర్గంలోని నందివెలుగు, అత్తోట గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌తో కలిసి పెమ్మసాని నిర్వహించారు. దారి పొడవునా ప్రజలంతా పూలవర్షంతో ఇరువురు నాయకులకు స్వాగతం పలుకగా పలుచోట్ల భారీ గజమాలతో, హారతులు పడుతూ నాయకులను కార్యకర్తలు గౌరవించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ‘ఇసుక అక్రమ తవ్వకాలతో సహజ వనరులు దెబ్బతినడమే కాక, పంట భూములు కూడా నాశనం అవుతాయి. ఇసుక తవ్వకాల్లో వచ్చిన అవినీతి సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుతున్నాయి. ప్రజలకు మొహం చూపించుకోలేని సీఎం ఐదేళ్లుగా బయటకు రాకుండా పాలన చేస్తున్నారు.’ అని విమర్శించారు. ప్రభుత్వ హయాంలో 500 రీచ్ లను అక్రమంగా తవ్వినట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలియజేసిందని చెప్పారు. ఇసుక తవ్వితే సహజ వనరుల అక్రమ రవాణా మాత్రమే గాక భూమిలోకి ఉప్పునీరు పూర్తిగా ఇంకిపోయి, పంట భూములను నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని తెలిపారు.
అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే తనకు వ్యక్తిగత అభిమానం ఉందని, బిజెపితో పొత్తు పవన్ చొరవేనని పేర్కొన్నారు. పవన్ లాంటి నీతి నిజాయితీ గల వ్యక్తికి ఆవేశం కాకుండా వైసీపీ నాయకుల్లా నక్కజిత్తులు ఉండాలా? అని ప్రశ్నించారు. ఇలాంటి అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఒక పెమ్మసాని, పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తులు ఎప్పుడూ ముందుంటారని స్పష్టంచేశారు.
స్వలాభం కోసమే వైసీపీలో పదవులు. వైసీపీ నాయకులు కేవలం స్వలాభం కోసమే పదవులను ఉపయోగించుకుంటున్నారని తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే యాదవపాలెంలో రోడ్లు ఎందుకు వేయలేకపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డను అని చెప్పుకొని గెలిచిన జగన్ ఇప్పుడు మాట ఎందుకు తప్పారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
అంతకుముందు ఏకలవ్వ నగర్‌లో స్థానికుతలో సమావేశంఅయ్యారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ సంక్షేమం పేరిట రూ. 5-10 వేలు ఇచ్చినంత మాత్రాన ప్రజల జీవన విధానం మారదు అని చెప్పారు. ఒక వ్యక్తి అర్హతలను బట్టి స్వయంగా సంపాదించుకొనే అవకాశాలు కల్పించినప్పుడే ఒక కుటుంబం గానీ సమాజం గానీ అభివృద్ధి బాటలో నడుస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన కారణంగా ఉద్యోగాలు లేక యువత ఇతర ప్రాంతాలకు, దేశాలకు వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన వాపోయారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments