ఏపీలో అన్ని బార్డర్లు మూసివేత.. రాకపోకలు బంద్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వాలు ప్రకటించిన విషయం విదితమే. మరోవైపు లాక్‌డౌన్‌ను పకడ్బందిగా అమలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు, సీఎస్‌లకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు మాట నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డీజీపీలకు ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని బార్డర్లను పూర్తిగా మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. కలెక్టర్లు, ఎస్పీలకు చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లు భేటీ కాన్ఫరెన్స్ నిర్వహించి.. పలు కీలక సూచనలు చేశారు.
రాకపోకలన్నీ బంద్!
‘ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్, ఒడిశా రాష్ట్రాలు వాహనాలను అనుమతించడం లేదు. రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వాహనాలను నిలిపివేస్తున్నాం. ఉదయం నుంచి జిల్లాల మధ్య రాకపోకలను కూడా అనుమతిచడట్లేదు.అత్యవసర సరకు రవాణా, అత్యవసర సేవల వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. బోర్డర్ల మూసివేత కారణంగా ప్రజలు ఎవరు రాకపోకలు కొనసాగించారాదు’ అని ఈ మేరకు కలెక్టర్లు, ఎస్పీలకు చీఫ్ సెక్రటరీ నీలం సహాని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లు దిశానిర్దేశం చేశారు.
మీడియాపై ఆంక్షలొద్దు!
ఇదిలా మీడియా మిత్రులపై హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో పోలీసులు దాడులకు తెగబడ్డారు. మీడియా అని చెబుతున్నా కూడా వినిపించుకోకుండా ఖాకీలు జులుం చిలిపించారు. ఈ క్రమంలో సంబంధిత మీడియా సంస్థలు మంత్రులు, డీజీపీలకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ‘మీడియాపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఎక్కడైనా తిరిగేందుకు అనుమతి ఉంటుంది. లాక్‌డౌన్ సందర్భంగా విధినిర్వహణలో ఉన్న మీడియా సిబ్బందికి మాత్రమే మినహాయింపు ఇవ్వాలని ఈ మేరకు అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర ప్రభుత్వం లేఖ కూడా రాసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments