అవన్నీ నిరాధారమైన ఆరోపణలు: ఎన్టీవీ

  • IndiaGlitz, [Friday,February 12 2021]

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన దగ్గర నుంచి ఫేక్ న్యూస్‌లకు ఏమాత్రం కొదవ లేకుండా పోతోంది. ముఖ్యంగా సినీ స్టార్స్ గురించి ఎక్కువగా రూమర్స్ ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల టీఆర్పీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి రిపబ్లిక్ టీవీ ఎడిటర్‌తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. టీఆర్పీ స్కామ్ తెలుగు రాష్ట్రాలకు సైతం పాకిందని.. దీనిలో ఎన్టీవీ భాగమైందంటూ ఓ న్యూస్ రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

అంతేకాదు.. ఏకంగా ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరిని ముంబై పోలీసులు జూబ్లీ హిల్స్‌లో అరెస్ట్ చేశారంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై ఎన్టీవీ తాజాగా స్పందించింది. అవన్నీ నిరాధారమైన ఆరోపణలుగా కొట్టిపడేసింది. తమ సంస్థ పేరును చెడగొట్టేందుకు కొందరు పనిగట్టుకుని ఈ ప్రచారం నిర్వహిస్తున్నారని ఎన్టీవీ తెలిపింది. ‘‘ఎన్టీవీ, ఎన్టీవీ చైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరి గురించి మా సంస్థ పేరును చెడగొట్టేందుకు ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో సర్క్యులేట్ అవుతున్న నిరాధారమైన రూమర్స్, సోషల్ మీడియా పోస్టులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని ఎన్టీవీ వెల్లడించింది.

కాగా.. గతంలో రిపబ్లిక్ టీవీ న్యూస్ ఛానెల్‌ సహా మూడు టీవీ ఛానెళ్లు డబ్బులు ఇచ్చి తమ టెలివిజన్ రేటింగ్ పాయింట్ల (టీఆర్‌పీ)ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపణలొచ్చాయి. దీనిలో భాగంగానే రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామి సహా పలువురిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

More News

ఇద్దరు తెలుగు స్టార్ హీరోలపై దృష్టి సారించిన బాలీవుడ్?

బాలీవుడ్ ఇండస్ట్రీ ముఖ్యంగా ఇద్దరు తెలుగు స్టార్స్‌పై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

100 వాహనాలు ఒకదానికొకటి ఢీ.. ఐదుగురి మృతి

ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 100 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

ప్రపంచంలో అత్యంత చవకైన ఏసీ ప్రయాణానికి రైల్వే శాఖ ఏర్పాట్లు!

ఏసీ రైలు అంటే కాస్ట్ మామూలుగా ఉంటుందా? ఆ ట్రైన్‌లో ప్రయాణించాలంటే చాలా పెద్ద మొత్తంలో రైల్వేకు చెల్లించాలి.

ఇక హీరోగా ప్రదీప్ కెరీర్ ముగిసినట్టేనా?

యాంకర్స్ అనగానే ప్రస్తుత పరిస్థితుల్లో గుర్తొచ్చే పేర్లు ఫిమేల్ అయితే సుమ.. మేల్ అయితే ప్రదీప్.

విజయ్ సేతుపతి దెబ్బకు విలవిల్లాడుతున్న స్టైలిష్ విలన్!

విజయ్ సేతుపతి.. ఈయనను హీరో అనాలా.. విలన్ అనాలా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనాలా..?