డిఫరెంట్ జానర్‌లో 'అలిషా'

  • IndiaGlitz, [Wednesday,January 01 2020]

సంగీతదర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమై తరువాత నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఆర్పీ పట్నాయక్‌. తన సంగీతంతో ఎన్నో సినిమాల సక్సెస్‌లో కీ రోల్‌ ప్లే చేసిన ఆర్పీ దర్శకుడిగా మాత్రం రెగ్యులర్‌ జానర్‌కు భిన్నంగా డిఫరెంట్ ఫార్మాట్‌ను ఎంచుకున్నాడు.

తాజాగా మరో ఇంట్రస్టింగ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు ఆర్పీ. అలిషా పేరుతో హారర్‌ థ్రిల్లర్‌గా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఐ ఎస్ ఎం ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై డాక్టర్‌ సోనాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రచనతో, దర్శకత్వంతో పాటు సంగీత దర్శకత్వం బాధ్యతలు కూడా ఆర్పీనే చూస్తున్నాడు.

అనుష్‌ గోరక్‌ సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా పనిచేస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య సాల్వి, వేదాంత్ సలూజా, రిచా కల్రా, అక్షయ్ బక్చు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ అంతా విదేశాల్లోనే జరుగుతోంది.

స్టార్ హీరోలు నటించిన చాలా సినిమాలు డాల్డీ ఎట్మాస్‌ సౌండ్‌తో రిలీజ్‌ అయినా.. ఆ సాంకేతికత కోసం తయారు చేసిన కథలు మాత్రం ఇంతవరకు మన దేశంలో రాలేదు. ఆలోటు భర్తి చేస్తూ షూటింగ్ చేస్తున్నప్పుడే డాల్బీ atmos సౌండ్ ని దృష్టిలో పెట్టుకుని ఆర్పీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఓ పర్ఫెక్ట్ థ్రిల్లర్‌కు అత్యున్నత ప్రమాణాలు కలిగిన సౌండ్‌ ఎఫెక్ట్స్‌ తోడైతే అవుట్‌పుట్‌ ఏ స్థాయిలో ఉంటుందో ఈ సినిమాతో చూపించనున్నారు. ఇందులో తవ్లీన్,
నదీమ్, నమన్, గోవింద్ సింగ్, గేహన సేథ్, సుశాంత్ ఠాకూర్, ఆమిర్, తాజ్ హవేద్, సల్మాన్, నితిన్, రూపాల్, ఐగిరిమ్, సైబ్జాన్, స్వరాజ్ విపిన్ నికం, ఇక్బాల్, శివమ్ జైస్వాల్, ఆశిష్ అన్షుమాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ, ఎడిటర్‌: అనుష్‌ గోరఖ్‌, టెక్నికల్‌ సపోర్ట్‌: ప్రాజెక్ట్‌ పెబల్‌ స్టూడియోస్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌ : నితిన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఆర్కా సాయి కృష్ణ, నిర్మాత: డాక్టర్‌ సోనాల్‌, కథ, సంగీతం, దర్శకత్వం: ఆర్పీ పట్నాయక్‌.