‘ఆర్ఆర్ఆర్‌’లో ఆలియా జాయిన్ అయ్యేదెప్పుడంటే...?

  • IndiaGlitz, [Thursday,October 08 2020]

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్ ...రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’ సినిమాలో న‌టిస్తున్న సంగతి తెలిసిందే. క‌రోనా ప్ర‌భావం లేకుండా ఉండుంటే ఆమె పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యుండేది. కానీ ప‌రిస్థితులు ఇంకా స‌హ‌క‌రించ‌డం లేదు. దీంతో.. ఆలియాభ‌ట్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంద‌ని, ఆమె స్థానంలో ప్రియాంక చోప్రాను తీసుకున్నట్లు వార్త‌లు వినిపించాయి కూడా. అయితే యూనిట్ ఆ విష‌యంపై నోరు మెద‌ప‌లేదు. రీసెంట్‌గా ట్రిపులార్ షూటింగ్ స్టార్ట్ అవ‌గానే తాను షూటింగ్‌లో పాల్గొనాలా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ట్లు ఆమె ట్వీట్ చేయ‌డంతో ఆమె ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంద‌ని వ‌స్తున్న వార్త‌ల‌కు చెక్ ప‌డింది.

తాజా స‌మాచారం మేర‌కు ఆలియాభ‌ట్ న‌వంబ‌ర్ మొద‌టివారంలో యూనిట్‌తో జాయిన్ అవుతుంద‌నే వార్త‌లు షికార్లు చేస్తున్నాయి. ప్ర‌స్తుతం తెలుగు నేర్చుకోవ‌డానికి త‌న వంతు క‌ష్టంప‌డుతుంది. స్పెష‌ల్ ట్యూట‌ర్‌ను పెట్టుకుని మ‌రీ నేర్చుకుంటుంద‌ని టాక్‌. త‌నే తెలుగులో స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పాల‌నుకుంటుంది ఆలియా. ట్రిపులార్‌లో ఈమె రామ్‌చ‌ర‌ణ్ జోడీగా అంటే సీత పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ విష‌యాన్ని యూనిట్ ఎప్పుడో క‌న్‌ఫ‌ర్మ్ చేసేసింది. భారీ బ‌డ్జెట్‌తో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య నిర్మాత‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ ప్యాన్ ఇండియా మూవీగా వ‌చ్చే ఏడాదిలోనే విడుద‌ల కానుంది.

More News

అసలు చర్చ వీడి.. ఈగ గురించి రచ్చ స్టార్ట్..

అది అమెరికాలోని ఊటా రాష్ట్రం.. ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య వాడివేడి చర్చ.. చిన్న చీమ కూడా దూరేందుకు వీలు లేని ఫ్లెక్సీ గ్లాస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో..

ట్రోలర్స్‌పై మండిపడిన మంచు లక్ష్మి..

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసులో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

షాకిచ్చిన ఛానెల్‌కు.. దిమ్మతిరిగేలా ‘నిశ్శబ్దం’ టీమ్ నోటీసులు

హైదరాబాద్‌కు చెందిన ఓ లోకల్ ఛానెల్ ‘నిశ్శబ్దం’ టీంకు షాకిస్తే.. వెంటనే రియాక్ట్ అయిన టీం.. ఛానల్‌కు దిమ్మ తిరిగేలా నోటీసులు పంపించింది.

బిగ్‌బాస్‌పై గీతా మాధురి సెటైర్..

బిగ్‌బాస్ కంటెస్టెంట్లు షో ముగిశాక కొందరు ఆరోపణలు గుప్పిస్తుంటారు.. మరికొందరు ఎడిటింగ్‌లో తమను మాటలను వక్రీకరించి చూపించారంటూ మండిపడుతుంటారు.

థియేటర్లు తెరిచాక రిలీజ్ కాబోయే తొలి సినిమా ఏదంటే...

సినిమా షూటింగ్‌లు.. ప్రతి ఒక్క హీరోది ఏదో ఒక సినిమా.. ఒక్కొక్కరు రెండు మూడు సినిమాలు సైతం కవర్ చేస్తుంటారు.