ఆలియా త‌ప్పుకోలేదు... అయితే!!

  • IndiaGlitz, [Tuesday,August 25 2020]

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’ సినిమాలో న‌టిస్తున్న సంగతి తెలిసిందే. క‌రోనా ప్ర‌భావం లేకుండా ఉండుంటే ఆమె పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యుండేది. కానీ ప‌రిస్థితులు ఇంకా స‌హ‌క‌రించ‌డం లేదు. దీంతో.. ఆలియాభ‌ట్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంద‌ని, ఆమె స్థానంలో ప్రియాంక చోప్రాను తీసుకున్నార‌ని అనుకుంటున్నార‌ట‌. కానీ ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని చిత్ర యూనిట్ స‌న్నిహిత వ‌ర్గాలు అంటున్నాయ‌ట‌.

ఎందుకంటే ‘ఆర్ఆర్ఆర్’ ప్రారంభం కావ‌డానికి మ‌రో రెండు నెల‌లు స‌మయం ప‌ట్టేలానే కనిపిస్తుంది. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఈ ఏడాది చివ‌ర‌లో సినిమాను షూటింగ్‌ను స్టార్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని, షూటింగ్ స్టార్ట్ అయిన కొన్ని రోజుల త‌ర్వాతనే ఆలియా సెట్స్‌లోకి జాయిన్ అవుతుంద‌ట‌. అంటే వ‌చ్చే ఏడాదిలోనే ఆలియా భ‌ట్ ..‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌లో పాల్గొంటుంద‌ని, కాబ‌ట్టి ఆమె ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంద‌ని వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని అంటున్నారు. డి.వి.వి.దాన‌య్య నిర్మాత‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ ప్యాన్ ఇండియా మూవీగా వ‌చ్చే ఏడాదిలోనే విడుద‌ల కానుంది.

More News

చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లి పీటలెక్కనున్న శర్వానంద్!

వైవిధ్యభరితమైన కథను ఎంచుకుంటూ ప్రతి సినిమానూ సక్సెస్ బాట పట్టించుకోవడంలో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ దిట్ట.

ట్రంప్ ప్రభుత్వం విధించిన నిషేధంపై కోర్టును ఆశ్రయించిన టిక్‌టాక్..

అమెరికా.. సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ సంస్థ నిర్వాహకుల మధ్య వివాదం ముదురుతోంది. సోమవారం టిక్‌టాక్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

చైత‌న్య‌కు త‌ప్ప‌డం లేదా!!

హీరోలు కొన్ని ప్రాజెక్టులు చేయ‌కూడ‌ద‌ని అనుకున్నా కూడా.. డైరెక్ట‌ర్, స్క్రీన్‌ప్లే న‌చ్చితే చేయాల్సి వ‌స్తుంది.

నిర్మాత‌కు డ‌బ్బులు వెన‌క్కిచ్చేసిన గోపీచంద్‌?

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీంచ‌ద్ ఇప్పుడు సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్‌’ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ రెండో దశ ట్రయల్స్‌ను ప్రారంభించిన భారత్

ఇండియాలో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ సెకండ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ మంగళవారం ప్రారంభమయ్యాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు