'ఆర్ఆర్ఆర్' నుండి వైదొలుగుతున్న అలియా భట్ ?

  • IndiaGlitz, [Thursday,March 19 2020]

బాహుబలి తర్వాత దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్‌. ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇందులో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్‌తో పాటు హాలీవుడ్ స్టార్స్ న‌టిస్తున్నారు. ఇందులో తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్‌గా న‌టిస్తోన్న‌ఎన్టీఆర్ జోడిగా బ్రిట‌న్ న‌టి ఒలివియా మోరిస్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో న‌టిస్తోన్నరామ్‌చ‌ర‌ణ్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ న‌టిస్తోంది.

సినిమా షూటింగ్ ఇప్ప‌టి వ‌ర‌కు 75 శాతం పూర్త‌య్యింది. ఇప్పుడు జ‌రుగుతున్న షెడ్యూల్‌లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ జాయిన్ కావాల్సి ఉంది. కానీ ఇంకా ఆ రానేలేదు. దీంతో ఆలియా సినిమా నుండి డ్రాప్ అయ్యింద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ఆలియా భ‌ట్ మేనేజ‌ర్‌తో ట‌చ్‌లో ఉన్నాడ‌ట‌. మ‌రి చివ‌ర‌కు ఆలియా ఏం చేస్తుంద‌నే స‌స్పెన్స్ మొద‌లైంది. ఒక‌వేళ ఆలియా డ్రాప్ అయితే రాజ‌మౌళి ఏం చేస్తాడ‌నే దానిపై కూడా వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 8న విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి క‌రోనా ఎఫెక్ట్ సినిమా విడుద‌లపై ప్ర‌భావాన్ని చూపిస్తుందో చూడాలి.