'ఆర్ఆర్ఆర్' లో ఆలియా భట్ సర్ప్రైజ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’(ఆర్ఆర్ఆర్). మార్చి నెలనాటికంతా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలనే ప్లానింగ్‌తో జక్కన్న షూటింగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకున్నాడు. ఈ సినిమాలో ఓ సాంగ్ ఉంటుంది.. ఆ సాంగ్‌లో ఫిమేల్ వాయిస్‌ను ఆలియాభట్ పాడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే ఆలియా భట్ హిందీ వెర్షన్ పాటను మాత్రమే పాడుతుందట. తెలుగు,తమిళంలో డబ్బింగ్ చెప్పినా పాట పాడటానికి ఆలియా ఒప్పుకోలేదని టాక్.
దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురంభీమ్‌గా, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 13న విడుదల కానున్న ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, సముద్రఖని, ఒలివియా మోరిస్, శ్రియా శరన్, అలిసన్ డూడి, రే స్టీవెన్ సన్ తదితరులు నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments