తెలుగు నేర్చుకుంటున్న అలియా భట్
- IndiaGlitz, [Monday,April 08 2019]
బాలీవుడ్ తార తెలుగు నేర్చుకుంటున్నారు. ఆమె ప్రత్యేకంగా తెలుగు ఎందుకు నేర్చుకుంటున్నారనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో నటిస్తుంది. ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా రూపొందుతోన్న ఈ మల్టీస్టారర్‌లో రాంచరణ్ అల్లూరి సీతా రామరాజుగా నటిస్తుంటే.. ఆయనకు జోడిగా అలియా భట్ నటించనున్నారు.
ఈ సినిమాలో తెలుగు మాట్లాడటానికని ఓ ట్యూటర్‌ను నియమించుకుని తెలుగు నేర్చుకుంటుందట. 'తెలుగు అన్నీ భావాలను పలికించే చక్కని భాష. ఆ పదాలను ఎందుకు పలుకుతున్నారు? అర్థమేంటి? అనే విషయాలను తెలుసుకుంటున్నాను. అప్పుడే పాత్రకు న్యాయం చేయగలను. నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కరణ్‌జోహార్, సంజయల్ లీలా భన్సాలి, రాజమౌళి దర్శకత్వంలో పనిచేయాలనుకున్నాను. కరణ్‌జోహార్‌గారు నన్ను హీరోయిన్గా పరిచయం చేశారు. ఇప్పుడు భన్సాలి గారితో రాజమౌళిగారితో పనిచేస్తున్నాను' అని ఓ మీడియాతో తెలిపారు అలియా భట్.