‘ఆర్ఆర్ఆర్’ సెట్స్‌లో అడుగుపెట్టిన ఆలియా..

ప్రభాస్‌తో బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’(ఆర్ఆర్ఆర్). యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి క్రియేట్ అయిన హైప్ అంతా ఇంతా కాదు. కాగా.. ఈ చిత్రం షూటింగ్‌కి ఆది నుంచి ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. అయితే.. ఈ సినిమాకు బాలీవుడ్‌లో క్రేజ్ తీసుకొచ్చేందకు ఆలియా భట్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంటే, చరణ్‌కు జోడిగా హిందీ నటి ఆలియా భట్ నటించనుంది.

కాగా.. ఈ సినిమా సెట్స్‌లోకి నిన్న మొన్నటి వరకూ ఆలియా అడుగు పెట్టలేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ సెట్స్‌లోకి అడుగు పెట్టినట్టు చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఆలియాకు వెల్ కమ్ చెబుతూ ఆమెకు జక్కన్న సీన్‌ను వివరిస్తున్న ఫోటోను షేర్ చేసింది. ‘‘మా ప్రియాతి ప్రియమైన సీతకు హార్ట్‌లీ వెల్‌ కమ్. ‘ఆర్ఆర్ఆర్’ సెట్స్‌పై బ్యూటీఫుల్, టాలెంటెడ్ ఆలియా’’ అని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్వీట్ చేసింది.

ఆలియా ‘ఆర్ఆర్ఆర్’ కోసం నవంబర్ 2 నుంచి ఏకబిగిన డేట్స్ కేటాయించిందని టాక్ నడిచింది. కానీ ఆలియా 2న కూడా షూటింగ్‌కి హాజరుకాకపోవడంతో ఆమె ఎంట్రీ మరింత ఆలస్యమవుతుందేమోనని అంతా భావించారు. కానీ ఆలియా కాస్త లేటైనా.. లేటెస్టుగా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది. ఈ కారణంగానే ఆమెకు ‘ఆర్ఆర్ఆర్’ కోసం డేట్స్ అడ్జెస్ట్ చేయడం కష్టం తరంగా మారిందని టాక్. ఎట్టకేలకు ఆమె ‘ఆర్ఆర్ఆర్’ సెట్స్‌లో ఎంట్రీ ఇచ్చింది.

More News

సింపుల్‌గా సింగర్ సునీత ఎంగేజ్‌మెంట్...

ప్రముఖ గాయని‌ సునీత‌(42) వివాహంపై ఈ మధ్య విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఆమె స్పందించకపోవడంతో అసలు ఆ వార్త నిజమా..

నిహారిక పెళ్లి కోసం రాజస్థాన్‌కు నాగబాబు కుటుంబం...

ఈనెల 9న మెగా డాటర్ నిహారిక వివాహం రాజస్థాన్ ఉదయ్ పూర్‌లో అత్యంత వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే.

తుపాను బాధితులకు అండగా పవన్ దీక్ష..

తెలంగాణలో తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు.

నడిగర్ సంఘం భవంతిలో అగ్ని ప్రమాదం

కోలీవుడ్‌కి చెందిన నడిగర్ సంఘం ఉన్న భ‌వంతిలో అగ్ని ప్రమాదం జరిగింది.

జీహెచ్ఎంసీనా మజాకా.. కేంద్రంపైనే యుద్ధానికి సిద్ధమైన కేసీఆర్..

తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా ఎదిగిపోవడం.. అటు దుబ్బాకలోనూ..