మహేశ్‌తో అలియా.. టాలీవుడ్‌లో చర్చ మొదలు!

  • IndiaGlitz, [Tuesday,December 24 2019]

సెక్సీయెస్ట్ లేడీ ఆఫ్ ది ఏషియా.. బాలీవుడ్ ముద్దుగుమ్మ.. అలియా భట్.. ‘ట్రిపుల్ ఆర్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30న విడుదల కానుంది. ట్రిపుల్ ఆర్ షూటింగ్ జరుగుతుండగానే.. అలియా మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేయనుందట. ఆశ్యర్యంగా ఉందా.. ఆగండాగండి.

అసలు విషయం ఏంటంటే.. మహేశ్ ప్రొడక్షన్ హౌజ్ ‘జీఎంబీ’లో నటిస్తుందట. గూఢచారి టీమ్ అడివి శేష్, శశికిరణ్ టిక్కా కాంబినేషన్‌లో మహేశ్ నిర్మిస్తున్న ‘మేజర్’ సినిమాలో ఈ తార కనిపించనుందట. తెలుగు, హిందీలలో నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రంలో ఆమె నటించడంతో నార్త్‌లో కూడా మార్కెట్ చేసుకోవచ్చని నిర్మాతలు భావిస్తున్నారు. సోనీ పిక్చర్స్ కూడా నిర్మాణంలో పాలుపంచుకుంటోంది. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఉన్ని కృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటిస్తున్నాడు.

మహేశ్ తను నటిస్తూ, నిర్మించిన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు.’ ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కనిపించనున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11న భారీ ఎత్తున విడుదలవుతోంది. దిల్ రాజు, అనిల్ సుంకర సహ నిర్మాతలు. సంగీత, ప్రకాశ్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.