అడివి శేష్‌తో అలియా.. టాలీవుడ్‌లో మరోసారి మెరవనుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
అడివి శేష్.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కూడా శేష్ ప్రాజెక్టులపై ఆసక్తి చూపుతున్నాయి. శేష్‌కు సంబంధించి తాజాగా ఓ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ .. శేష్ సరసన నటించనుందట. శేష్ ప్రస్తుతం ‘మేజర్’ సినిమా చేస్తున్నాడు. శశి కిరణ్ టిక్కా దర్శకుడు. 26/11 తీవ్రవాద దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది.
సూపర్ స్టార్ మహేశ్ బాబుకు చెందిన జీఎంబీ, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తెలుగు, హిందీ భాషల్లో నిర్మితమవుతున్న ఈ సినిమాలో అలియాను నటింప చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఆమె వల్ల సినిమాకు మైలేజ్ మరింత పెరుగుతుందని వారి భావన. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు జరిపారని సమాచారం. అయితే ఆమె తన నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టిందట.
అలియా ప్రస్తుతం టాలీవుడ్ ప్రతిష్ఠాత్మక ‘ట్రిపుల్ ఆర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా నటిస్తోంది. ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ యాక్ట్ చేస్తోంది. వచ్చే ఏడాది జూలై 30న సినిమా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments