సినిమాల్లోనే చస్తానంటున్న అలియాభట్Â
- IndiaGlitz, [Monday,October 09 2017]
బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్.. ఇప్పుడు రచయితలపై కాస్త కోపంగా ఉంది. అందుకు కారణం. వారు హీరోయిన్స్‌కు తగ్గట్లు పాత్రలను క్రియేట్ చేయడం లేదట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అలియా భట్ మాట్లాడుతూ.. సీనియర్ హీరోయిన్స్ అయిన మాధురి దీక్షిత్ వంటి నటీమణులు సల్మాన్‌ఖాన్ వంటి సీనియర్ హీరోస్తో నటించకపోవడానికి కారణం రచయితలేనట. వారు మంచి పాత్రలను క్రియేట్ చేస్తే, సీనియర్ హీరోయిన్స్‌కు నటనలో స్పేన్ పెరుగుతుందనేది అలియా వాదన. తాను మాత్రం 90 ఏళ్లు వచ్చేదాకా సినిమాల్లోనే నటిస్తానని, సినిమాల్లో నటిస్తూనే సినిమాలకు గుడ్ బై చెబుతానని అంటుంది అలియా భట్.