పవన్ కల్యాణ్‌కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన అలీ..
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కమెడియన్ అలీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అలీ నమ్మక ద్రోహం చేశారని.. అసలు స్నేహమంటే ఇదేనా అలీ అంటూ పవన్ మాట్లాడుతూ ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారంపై ఎట్టకేలకు అలీ స్పందించి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. అయితే అలీ తాజా వ్యాఖ్యలతో వ్యవహారం మరింత ముదిరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
మీరు చిరు బాటలో వచ్చారు.. నెనలా కాదు సార్!
"పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో కామెంట్ చేశారు. నేను పుట్టింది, పెరిగింది రాజమండ్రి. నేను పుట్టిన గడ్డకు నా తండ్రి పేరున ట్రస్ట్ పెట్టుకొని కులమతాలకు అతీతంగా సేవ చేస్తున్నాను. రాజమండ్రిలో పవన్ వ్యాఖ్యలు నన్ను బాధించాయి. పవన్ చుట్టుప్రక్కల ఉన్నవారు ఆలీ మీద వ్యాఖ్యలు చేయమంటే మీరు చేసి ఉంటారు. మీరు చిరంజీవి వేసిన బాటలో మీరు వచ్చారు. కానీ నేను నా బాట వేసుకొని పైకి వచ్చాను. నేను వైసీపీకి ప్రచారం కోసం చాలా జిల్లాల్లో చేశాను. నేను మీ స్థానం గుండెల్లో పెట్టుకున్నాను. పవన్... మీరు ఎప్పుడూ బావుండాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి లైన్లో మొదటి వ్యక్తిని నేను" అని అలీ
చెప్పుకొచ్చారు.
మీరు నాకు చేసిన సాయమేంటి సార్..!?
"ఆలీ కష్టాల్లో ఉన్నప్పుడు సాయపడ్డాను అని పవన్ అన్నారు. మీరు ఏ విధంగా సాయపడ్డారు పవన్ సర్. అంటే ధనం ఏమైనా ఇచ్చారా? నాకు ఏమైన సినిమాలు చెప్పారా? సినిమాలు లేక ఇంట్లో ఉంటే తీసుకెళ్లి అవకాశాలు ఇప్పించారా? సర్.. మీరు ఇండస్ట్రీలోకి రాకమునుపు నుంచి నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను సర్. నేను ఎవ్వరి దగ్గరా అయ్యా నేను కష్టాల్లో ఉన్నాను. రూపాయి సాయం చేయమని ఏనాడూ ఎవ్వరి దగ్గరా అడగలేదు. అల్లా దయవల్ల చాలా బాగున్నాను. ఇంకా అడిగే అవకాశం వస్తే అప్పటికి అలీ ఉండడు. వెళ్లను కూడా. ఆకలితో చచ్చిపోతాను తప్ప వెళ్లి అమ్మా.. దేహీ అనే స్థితికి వెళ్లను. మీకు తెల్సు నేను కుటుంబాన్ని ఎలా చూసుకుంటానో. నేను ఎవ్వర్ని మనసు బాధపడేలా ఇంతముక్క చెప్పను. మీరు రాజమండ్రిలో విమర్శ చేయటం సరికాదు" అని పవన్‌కు అలీ హితవు పలికారు.
వైసీపీలోకి వెళ్తే తప్పేంటి..?
"వైసీపీలో వెళ్లటం తప్పేంటి? అదేమైన నేరమా? రాజ్యాంగంలో రాసుందా అక్కడకు వెళ్లకూడదని. నాకు స్వేచ్ఛ లేదా? మీ గురించి నేను వ్యాఖ్యానిస్తే మీరు నాగురించి కామెంట్ చేయాలి. రాజమండ్రిలో మీరు కామెంట్ చేయటం సరికాదు. మీరు నా చుట్టానికి టిక్కెట్ ఇచ్చానని పవన్ అంటున్నారు. నేను మిమ్మల్ని వచ్చి అడిగానా? పోనీ ఇచ్చే ముందు నన్ను అడిగారా.. అదెలా చెబుతారు సర్. నా నెంబర్ మీ దగ్గర ఉంది. 12- 14 ఏళ్లు నుంచి ఒకే నెంబర్ మెయింటైన్ చేస్తున్నాను. పార్టీలోకి రమ్మను పవన్ ఎప్పుడైనా అడిగారా? అడగను అప్పుడు ఇంత పెద్ద కామెంట్ చేయటం ఎందుకు?" అని ఆలీ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అలీ వ్యాఖ్యలకు జనసేనాని నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి. మరీ ముఖ్యంగా జనసేన కార్యకర్తలు, మెగాభిమానుల నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout