జనసేన ఆఫీస్‌లో ఇఫ్తార్ విందు.. అలీ తమ్ముడు హాజరు!
Send us your feedback to audioarticles@vaarta.com
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఘనంగా ఇఫ్తార్ విందునిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మహ్మద్ సిరాజ్ ఉర్ రెహ్మాన్, మహ్మద్ అలీ బేగ్, సయ్యద్ ఇలియాస్ అహ్మద్, సినీనటుడు ఖయ్యూమ్, ముస్లిం మహిళ సంఘం నాయకులు మహ్మద్ ఇమామ్ తహిసిల్‌తోపాటు దాదాపు 500 మంది ముస్లిం సోదరులు పాల్గొని నమాజ్ నిర్వహించారు.
అల్లా అందరినీ చల్లగా చూడాలి..!
ఈ సందర్భంగా ఉపన్యాసకులు మహ్మద్ సిరాజ్ ఉర్ రెహ్మాన్ మాట్లాడుతూ.. "పేదవాడి ఆకలి బాధలను తెలుసుకోవడమే పవిత్ర రంజాన్ మాసం ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలో ఏ దేశంలో లేని మత సామరస్యం మనదేశంలోనే ఉంది. అదే మన గొప్పతనం. మత సామరస్యాన్ని, ఆత్మీయతను, సుహృద్భావాన్ని చాటే అపురూపమైన పండుగ రంజాన్. హిందూ, ముస్లింల మధ్య సోదర భావాన్ని పెంపొందించే లా ఈ మాసం ఉంటుంది. రంజాన్ పండుగ ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని తీసుకురావాలి, అల్లా అందరినీ చల్లగా చూడాలి.
తల్లి పాదాల చెంతే స్వర్గం ఉందని ఇస్లాం చెప్పిందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో చెప్పినప్పుడు ఎంతో ఆనందపడ్డాను. పుల్వామా దాడులపై ఆయన స్పందించిన తీరు, ఉగ్రదాడి జరిగిన ప్రతిసారి ముస్లింలు దేశ భక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ చెప్పడం స్థైర్యాన్నిచ్చింది" అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు మాదాసు గంగాధరం, అర్హం యూసఫ్ ఖాన్, మహేందర్ రెడ్డి, నేమూరి శంకర్ గౌడ్, ఎ.వి.రత్నం, పి.హరిప్రసాద్, పులి శేఖర్, వై. నగేష్, షేక్ రియాజ్, నయూబ్ కమాల్, భాస్కర్ నాయక్‌లు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు అనంతరం ముస్లీం సోదరులకు పార్టీ నేతలు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout