హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేటి నుంచి విద్యుత్ కోతలు..

  • IndiaGlitz, [Wednesday,January 17 2024]

హైదరాబాద్ వాసులకు ప్రభుత్వం షాకింగ్ వార్త అందించింది. ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా హాయిగా గడుపుతున్న నగరవాసులకు ఉక్కపోత మొదలుకానుంది. నేటి నుంచి పలు ప్రాంతాల్లో విద్యుత్ కోతలు ఉంటాయని ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జోన్లలో రోజుకు 15 నిమిషాల నుంచి రెండు గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని TSSPDCL తెలిపింది. వచ్చే వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ భారీగా ఉండే అవకాశమున్న నేపథ్యంలో దానిని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం విద్యుత్ సబ్‌స్టేషన్లతో పాటు లైన్ల మరమ్మతు చేపట్టినట్లు వెల్లడించింది.

వేసవిలో ఎదురయ్యే సమస్యను అధిగమించాలంటే ప్రస్తుతం శీతాకాలం అయ్యే లోపు విద్యుత్ కోతలు తప్పవని చెప్పుకొచ్చింది. అయితే ఆదివారాలతో పాటు పండుగ రోజుల్లో విద్యుత్ కోతలకు మినహాయింపు ఇచ్చింది. రొటేషన్ ప్రాతిపదికన విద్యుత్ లైన్లు మరియు సబ్ స్టేషన్ల నిర్వహణతో పాటుగా మరమ్మతు పనులను చేపడుతున్నట్లు వివరించింది. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌లలోని వెయ్యి 209 సబ్‌ స్టేషన్లలో రిపేర్లు చేపట్టామని.. ఇక సైబర్‌ సిటీ, సరూర్‌ నగర్‌, రాజేంద్రనగర్‌ సర్కిల్స్‌లోని 615 సబ్‌ స్టేషన్లలో రిపేర్లు ఉంటాయని పేర్కొంది. అటు మేడ్చల్‌, హబ్సిగూడ సర్కిల్స్‌లోని 586 సబ్‌స్టేషన్లలో రిపేర్లు చేపట్టినట్లు సూచించింది.

అలాగే విద్యుత్‌ కోతకు సంబంధించిన సమాచారాన్ని తమ వెబ్‌సైట్‌లో ఎప్పటికపుడు అప్‌డేట్‌ చేస్తామని వెల్లడించింది. నిర్వహణ పనులు చేపట్టే ప్రాంతంలోని విద్యుత్ వినియోగదారులు విద్యుత్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. తమ ప్రభుత్వంలో నిరంతం ఎలాంటి కోతలు లేకుండా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేశామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విద్యుత్ కోతలు ఉంటాయని తాము హెచ్చరించినట్లే ఇప్పుడు జరుగుతుందని మండిపడుతున్నారు. వేసవిలో నాణ్యమైన విద్యుత్ అందించడానికే ప్రస్తుతం కోతలు విధిస్తున్నామని కాంగ్రెస్ నేతలు స్పష్టంచేస్తున్నారు.

More News

Naa Saami Ranga: అదరగొడుతున్న నాగార్జున.. 'నా సామిరంగ' మూడు రోజులు కలెక్షన్స్ ఎంతంటే..?

సంక్రాంతి పండుగకి కింగ్ నాగార్జున మరోసారి హిట్ కొట్టాడు. గతంలో సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు చిత్రంతో హిట్స్‌ కొట్టగా.. తాజాగా 'నా సామిరంగ' చిత్రంతోనూ అదే సెంటిమెంట్ రిపీట్ అయింది.

Governor Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్(ఎక్స్) అకౌంట్ హ్యాక్

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి రాజకీయ ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఎక్స్(ట్విట్టర్)అకౌంట్ హ్యాక్‌ అయింది.

Anganwadis: సమ్మె ఉధృతం చేసిన అంగన్‌వాడీలు.. నేటి నుంచి నిరవధిక దీక్షలు..

రోజురోజుకు ప్రభుత్వంపై అంగన్‌వాడీలు పోరును ఉధృతం చేస్తున్నారు. తమ డిమాండ్స్ మొత్తం నెరవేరే వరకు సమ్మెను ఆపేది లేదని భీష్మించుకున్నారు. పండుగ సెలవులు కూడా లేకుండా ధర్నాలు చేస్తున్నారు.

క్వాష్ పిటిషన్‌పై చంద్రబాబుకు సుప్రీంకోర్టులో దక్కని రిలీఫ్

స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ద్విసభ్య ధర్మాసనం భిన్నమైన తీర్పును ఇచ్చింది.

Mahesh Babu: ఇదే నా చివరి తెలుగు సినిమా.. అవి నిజమైన బీడీలు కావు: మహేష్

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు నటించిన ‘గుంటూరు కారం’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్లలో అభిమానులను అలరిస్తోంది. మూవీలో మహేష్ డ్యాన్స్, నటన, స్వాగ్, స్లాంగ్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి.