పాపం...అఖిల్ సయేషా..!

  • IndiaGlitz, [Monday,October 31 2016]

అఖిల్ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ స‌యేషా సైగ‌ల్. బాలీవుడ్ సీనియ‌ర్ ఏక్ట‌ర్ దిలీప్ కుమార్ మ‌న‌వ‌రాలైన స‌యేషా టాలీవుడ్ సీనియ‌ర్ ఏక్ట‌ర్ అక్కినేని మ‌న‌వ‌డు అఖిల్ తో న‌టించి అంద‌రి దృష్టి ఆక‌ర్షించింది. టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అవ్వాల‌ని చాలా ఆశ‌లు పెట్టుకుంది. అయితే...అఖిల్ మూవీ స‌క్సెస్ కాక‌పోవ‌డంతో...టైమ్ క‌లిసి రాకపోవ‌డంతో ఆమె ఆశ నిరాశే అయ్యింది. ఇక టాలీవుడ్ లో లాభం లేద‌నుకుని బాలీవుడ్లో ప్ర‌య‌త్నించింది.
అజ‌య్ దేవ‌గ‌న్ స‌ర‌స‌న శివాయ్ చిత్రంలో న‌టించింది. ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా రిలీజైంది. అయితే...ఇక్క‌డ కూడా స‌యేషాకు టైమ్ క‌లిసి రాలేదు. సినిమా ఫ్లాప్ అయ్యింది. టాలీవుడ్, బాలీవుడ్ రెండింటిలో స‌యేషాకు స‌క్సెస్ రాలేదు. ఇక మూడ‌వ ప్ర‌య‌త్నంగా కోలీవుడ్ లో ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రి...మూడ‌వ ప్ర‌య‌త్నం అయినా ఫ‌లిస్తుందో లేదో చూడాలి..!

More News

సాహసం శ్వాసగా సాగిపో రిలీజ్ డేట్ ఫిక్స్..!

అక్కినేని నాగచైతన్య నటించిన ప్రేమమ్ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే.

రాజ్ త‌రుణ్ కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త ఫ‌స్ట్ లుక్ రిలీజ్..!

రాజ్ త‌రుణ్ హీరోగా దొంగాట ఫేమ్ వంశీకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌. ఈ చిత్రాన్ని ఎ.కె ఎంట‌ర్ టైన్మెంట్స్  సంస్థ నిర్మిస్తుంది. దీపావ‌ళి సంద‌ర్భంగా కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసారు.

తాత చెప్పిన ఆ మాటే నరుడా డోనరుడా సినిమా తీసేలా చేసింది - సుమంత్

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం నరుడా డోనరుడా. ఈ చిత్రంలో సుమంత్ సరసన పల్లవి సుభాష్ నటించింది. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

సినిమాల గురించి క్లారిటీ ఇచ్చిన నిర్మాత

తెలుగులో ఈ ఏడాది మా బ్యానర్లో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. ., అందులో మూడు సినిమాలు పెద్ద సక్సెస్ సాధించాయని చెప్పుకొచ్చారు నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి. క్షణం, బ్రహ్మోత్సవం, ఊపిరి, కాష్మోరా సినిమాలు విడుదలైతే బ్రహ్మోత్సవం తప్ప మిగిలిన సినిమాలు మంచి విజయాలను సాధించాయి.

సింగం3లో అవే కనపడతాయట

సూర్య, హరి కాంబినేషన్లో వచ్చిన సింగం సీక్వెల్స్ పెద్ద హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఇప్పుడు సింగం 3 డిసెంబర్ 16న విడుదలవుతుంది. ఈ చిత్రంలో అనుష్కతో పాటు శృతిహాసన్ నటిస్తుంది. శృతిహాసన్ రోల్ గురించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి.