Ala Vaikunthapurramuloo Review
వరుస సినిమాలు చేస్తూ ఓ కూల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయాలనుకున్న బన్నీ దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత తనతో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి విజయవంతమైన చిత్రాలు చేసిన త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ చేసిన మూడో చిత్రం `అల..వైకుంఠపురములో`. హ్యాట్రిక్ కాంబో కావడం.. తమన్ సంగీతంలో విడుదలైన పాటలు సూపర్‌డూపర్ హిట్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆక్టటుకుందా? గ‌్యాప్ తర్వాత బన్నీ చేసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా అనే విషయాలు తెలియాలంటే కథలోకి వెళదాం...
కథ:
రామచంద్ర(జయరాం), వాల్మీకి(మురళీశర్మ) ఒకేసారి కెరీర్‌ను స్టార్ట్ చేస్తారు. అయితే రామచంద్ర తన తెలివి తేటలతో ఓ కంపెనీ సీఈఓ స్థాయికి ఎదుగుతాడు. ఆ కోపంతో ఉన్న వాల్మీకి.. హాస్పిటల్లో పుట్టిన తన కొడుకును అతని కొడుకు స్థానంలో ఉంచేస్తాడు. అతని కొడుకు తన కొడుకుగా పెంచుతూ చీటీకి మాటీకి చిన్న చూపు చూస్తుంటాడు. 20 ఏళ్లు గడుస్తాయి. వాల్మీకి ఇంట్లో పెరిగిన రామచంద్ర కొడుకు బంటు(అల్లు అర్జున్) అన్నీ విషయాల్లో చురుకుగా ఉంటాడు. రామచంద్ర ఇంట్లో పెరిగిన వాల్మీకి కొడుకు రాజా(సుశాంత్) నెమ్మదిగా ఉంటాడు. రాజా తన బిజినెస్ వ్యవహారాలను చూసుకోవాలని రామచంద్ర అనుకున్నా.. అతని సంశయిస్తుంటాడు. ఈలోపు బంటు అమూల్య(పూజా హెగ్డే) ట్రావెల్ కంపెనీలో ఉద్యోగానికి చేరుతాడు. అక్కడ అమ్యూల, బంటు ప్రేమలో పడతారు. ఆలోపు అమూల్య తండ్రితో రామచంద్ర సంబంధం మాట్లాడుతాడు. నిశ్చితార్థం జరగుతుంది. తర్వాత అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదంలో రామచంద్రను బంటు కాపాడుతాడు. హాస్పిటల్ వెళ్లిన బంటుకి తనే రామచంద్ర అసలు కొడుకు అనే నిజం తెలుస్తుంది. అప్పుడు అతనేం చేస్తాడు? తనే అసలు వారసుడు అని ఎలి చెబుతాడు? అమూల్య ప్రేమను ఎలా దక్కించుకుంటాడు? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష: నటీనటుల పనితీరు
బన్నీ:
దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనదైన స్టైల్లో స్టైలిష్‌గా కనపడ్డాడు. యాక్షన్ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు. ఇక డాన్సుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా అంతటినీ చక్కగా పుల్ చేశాడు. సెటిల్డ్ పెర్ఫామెన్స్ చేస్తూనే వీలున్న చోటల్లా కామెడీని పండించాడు.
పూజా హెగ్డే:
పూజా హెగ్డే ట్రావెల్ కంపెనీ యజమానురాలుగా చక్కగా నటించింది. గ్లామర్‌గా కనపడింది. పాత్ర పరిధి మేర చక్కగా నటించింది.
జయరాం, టబు:
భార్యభర్తలుగా నటించారు. వీరిద్దరి పాత్రలను హుందాగా చూపించారు.
సుమద్రఖని, అజయ్:
సింపుల్ విలనిజాన్ని చక్కగా ఆవిష్కరించారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో తన విలనిజాన్ని త్రివిక్రమ్ తెరపై చూపించిన విధానం బావుంది.
మురళీశర్మ:
చక్కటి పాత్ర... సినిమా కథకు తనే మూలంగా ఉంటాడు. ఈ పాత్రను చక్కటి హావభావాలతో మురళీశర్మ తెరపై ఆవిష్కరించాడు.
ఇతర నటీనటులు:
సునీల్, హర్షవర్ధన్, నవదీప్, రాహుల్ రామకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, సచిన్ ఖేడేకర్, రోహిణి, బ్రహ్మాజీ తదితరులు వారి వారి పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు... త్రివిక్రమ్:
ఎప్పటిలాగానే సినిమాను కూల్‌గా చిత్రీకరించారు. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తెరపై ఆవిష్కరించారు. ఎమోషనల్ సీన్స్‌ను, కామెడీ సీన్స్‌ను చక్కగా ఎలివేట్ చేశారు. సందర్భానుసారం మంచి డైలాగ్స్ రాశారు. అలాగే సన్నివేశాలను రిచ్‌గా చిత్రీకరించారు. క్లైమాక్స్‌ను ఏదో భారీగా చిత్రీకరించాలని కాకుండా శ్రీకాకుళం యాసలో సాగే పాటతోనే ముగించేశారు. ఓ పాత కథను తీసుకుని దానికి హంగులు మార్చి తనదైన స్టైల్లో తెరకెక్కించాడు.
తమన్:
ఈ సినిమాకు మ్యూజిక్ ప్రధాన భూమికను పోషించింది. సామజవరగమన, రాములో రాముల, బుట్ట బొమ్మ సాంగ్‌తో పాటు క్లైమాక్స్ ఫైట్‌గా వచ్చే శ్రీకాకుళం యాసలో సాగే పాటలు బావున్నాయి. నేపథ్య సంగీతం బావుంది.
కెమెరా:
పి.ఎస్.వినోద్ ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. స్టైల్‌గా, రిచ్‌గా చూపించాడు.
మైనస్ పాయింట్స్:
పాత కథ.. కథలో ఎలాంటి ట్విస్టులు ఉండవు. సినిమా నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే సాంగ్స్ సీన్.. బాగానే ఉన్నా... కాస్త ఓవర్‌గా ఉన్నట్లు ఆ సీన్‌కు హీరో ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నాడో అనిపిస్తుంది. అయితే ఆ సీన్‌ను ఆడియెన్స్ కోసం రీ క్రియేట్ చేశారనినిపస్తుంది.
బోటమ్ లైన్: అల వైకుంఠపురములో... కూల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
Read 'Ala Vaikunthapurramloo' Review in English
- Read in English