'అల వైకుంఠపురంలో..' సెన్సార్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్‌పై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2020 సంక్రాతి కానుకగా చిత్రం విడుదల అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
కాగా ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజు పూర్తయ్యాయి. 'యు/ఎ' సర్టిఫికెట్ లభించింది. చిత్రం విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో నిర్మాతలు మాట్లాడుతూ....'అల వైకుంఠపురంలో' సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన అన్ని సాంగ్స్ ఎంతో పాపులర్ అయ్యాయి. పాటలు ఇంతటి ప్రాచుర్యం పొందిన సందర్భాన్ని పురస్కరించుకుని, 2020 జనవరి 6న యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో ''అల వైకుంఠపురంలో..మ్యూజికల్ ఫెస్టివల్ ను '' వైభవంగా, వినూత్నంగా జరుపుతున్నట్లు తెలిపారు.
సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments