‘అల వైకుంఠపురములో..’ డెలిటెడ్ సీన్.. ‘అర్జున్ రెడ్డి-2’!

  • IndiaGlitz, [Monday,March 16 2020]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నీ హీరోగా న‌టించిన ‘అల‌..వైకుంఠ‌పుర‌ములో’ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్దే నటించగా.. అక్కినేని హీరో సుశాంత్ ఓ కీలకపాత్రను పోషించాడు. సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో బాక్సాఫీస్‌ను షేక్ చేసి.. కలెక్షన్ల వర్షం కూడా గట్టిగానే కురిపించింది. బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడమే కాకుండా.. ఫస్ట్ ఇండస్ట్రీ హిట్‌గానూ ఈ చిత్రం నిలిచింది. సినిమా రిలీజ్‌కు ముందు నుంచే ఇందుకు సంబంధించిన లుక్స్, టీజర్స్, ట్రైలర్స్, మరీ ముఖ్యంగా సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేశాయి. అయితే తాజాగా డెలిటెడ్ సీన్ అంటూ సినిమా యూనిట్ 01:39 నిమిషాల నిడివి గల వీడియోను విడుదల చేసింది. ఇందులో బన్నీ-సుశాంత్‌ మధ్య సాగే సన్నివేశాలు ఉన్నాయి. ఇవాళ రిలీజ్ చేసిన ఈ వీడియోకు 106,337 వచ్చాయి. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది.

వీడియోలో ఏముంది..!?

బంటి (అల్లు అర్జున్), రాజు (సుశాంత్)ల మధ్య జరిగే కామెడీ సంభాషణ ఈ వీడియోలో ఉంది. సుశాంత్ తాగుతున్నప్పుడు బంటి వీడియో తీసి.. దీన్ని షార్ట్ ఫిల్మ్‌గా ‘అర్జున్ రెడ్డి 2’గా తీస్తున్నానని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తాడు. అయితే ఇందుకు భయపడ్డ రాజు.. ‘నేనేం చేయాలి.. నీకేం కావాలి చెప్పు..’ అని భయపడుతూ తెగ కంగారుతో పడిపోతాడు. వెంటనే ఆఫీస్‌కు బస్సులో వెళ్లేందుకు రాజు పరిగెత్తడం, వెనుక కారులో బంటి వీడియో తీస్తుంటే అదే కారులో ఉన్న వాల్మీకి అల్లాడిపోతుండటం వంటివి ఈ వీడియోలో ఉన్నాయి. అయితే ఇది సినిమాలో పెట్టేంత సీన్ కాకపోవడంతో తీసేయడం జరిగింది.

More News

విదేశాల నుంచి వచ్చినవారికి జగన్ సర్కార్ స్ట్రాంగ్ వార్నింగ్

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఏపీలో జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ కరోనాపై తప్పుడు ప్రచారాలు చేస్తే కేసులే..: ఈటల

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వందల సంఖ్యలో చనిపోగా..

షాకింగ్ రోల్‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌?

ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ఏక‌ధాటిగా సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నాడు.

అల్లు అయాన్ అభిమాన హీరో ఎవ‌రో తెలుసా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌న‌యుడు అల్లు అయాన్ బాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ టైగ‌ర్ ష్రాఫ్‌కు పెద్ద అభిమానట‌.

ఏపీలో ఎన్నికలు యథావిథిగా జరుగుతాయా..!?

కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఆదివారం నాడు కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిదే.