‘అల..వైకుంఠపురములో’ అరుదైన రికార్డ్
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ హీరోగా నటించిన ‘అల..వైకుంఠపురములో’ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా విజయవంతంగా రన్ అవుతుండగా.. మరోవైపు కలెక్షన్ల వర్షం కూడా గట్టిగానే కురుస్తోంది. కాగా.. ఈ మూవీ అరుదైన రికార్డ్ సృష్టించింది. యూఎస్‌లో వీకెండ్లోనే మొదలైన ‘అల’ హడావుడి మొదలైంది. అత్యధిక కలెక్షన్ల సాధించిన 10 సినిమాల్లో ‘అల..వైకుంఠపురములో’ అగ్రస్థానంలో నిలిచింది.
అయితే హాలీవుడ్ సినిమాలను పక్కకు నెట్టి ఈ సినిమా $1.43 మిలియన్లు వసూలు చేయడం విశేషమని చెప్పుకోవచ్చు. కాగా.. ఆ టాప్ 10 సినిమాల్లో 5 ఇండియన్ సినిమాలు ఉండటం రికార్డే అని చెప్పుకోవచ్చు. అలవైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు, దర్బార్, చపాక్, తానాజీ చిత్రాలు ఉండటం విశేషమని చెప్పుకోవచ్చు. కాగా.. తెలుగు రాష్ట్రాల్లోనూ కలెక్షన్ల పరంగా ‘అల’ అలా దూసుకెళ్లింది. ఇప్పటికే సక్సెస్ మీట్‌ను సైతం చిత్రబృందం చేసేసుకుంది. మరోవైపు సంక్రాంతి విన్నర్ తమ సినిమానే అని దర్శకనిర్మాతలు చెప్పుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com