‘అల‌..వైకుంఠ‌పుర‌ములో’ అరుదైన రికార్డ్

  • IndiaGlitz, [Tuesday,January 14 2020]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నీ హీరోగా న‌టించిన ‘అల‌..వైకుంఠ‌పుర‌ములో’ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా విజయవంతంగా రన్ అవుతుండగా.. మరోవైపు కలెక్షన్ల వర్షం కూడా గట్టిగానే కురుస్తోంది. కాగా.. ఈ మూవీ అరుదైన రికార్డ్ సృష్టించింది. యూఎస్‌లో వీకెండ్‌లోనే మొదలైన ‘అల’ హడావుడి మొదలైంది. అత్యధిక కలెక్షన్ల సాధించిన 10 సినిమాల్లో ‘అల‌..వైకుంఠ‌పుర‌ములో’ అగ్రస్థానంలో నిలిచింది.

అయితే హాలీవుడ్ సినిమాలను పక్కకు నెట్టి ఈ సినిమా $1.43 మిలియన్లు వసూలు చేయడం విశేషమని చెప్పుకోవచ్చు. కాగా.. ఆ టాప్ 10 సినిమాల్లో 5 ఇండియన్ సినిమాలు ఉండటం రికార్డే అని చెప్పుకోవచ్చు. అలవైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు, దర్బార్, చపాక్, తానాజీ చిత్రాలు ఉండటం విశేషమని చెప్పుకోవచ్చు. కాగా.. తెలుగు రాష్ట్రాల్లోనూ కలెక్షన్ల పరంగా ‘అల’ అలా దూసుకెళ్లింది. ఇప్పటికే సక్సెస్ మీట్‌ను సైతం చిత్రబృందం చేసేసుకుంది. మరోవైపు సంక్రాంతి విన్నర్ తమ సినిమానే అని దర్శకనిర్మాతలు చెప్పుకుంటున్నారు.

More News

వెంక‌టేశ్ 'అసుర‌న్‌' కి ముహూర్తం కుదిరింది

త‌మిళంలో ధ‌నుష్ హీరోగా న‌టించిన చిత్రం `అసుర‌న్‌`. వెట్రిమార‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో వెంక‌టేశ్ హీరోగా రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

న‌వ‌ల ఆధారంగా హీరో సూర్య సినిమా

త‌మిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. అందుక‌నే ఆయ‌న సినిమాలు త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుద‌ల‌వుతుంటాయి.

ఈ మూడ్రోజుల్లో 3 రాజధానులపై తేలిపోనుంది!

నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపు వ్యవహారంపై గత కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు, ర్యాలీలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

బొంబాట్‌లో `ఇష్క్ కియా...' సాంగ్‌ను విడుద‌ల చేసిన ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

క‌ళ్ల‌లోన దాచినానులే.. రెప్ప‌దాటి పోలేవులే కాటుకైన పెట్ట‌నులే.. నీకు అంటుకుంటుంద‌ని

'డిస్కోరాజ' సెకండ్ టీజర్ విడుదల

మాస్ మహా రాజ ర‌వితేజ ప్ర‌స్తుతం డిస్కో రాజా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.