నాన్ బాహుబలి 2 రికార్డ్స్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో !!!

  • IndiaGlitz, [Thursday,January 16 2020]

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయికలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురం లో సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ యాక్టింగ్, డాన్స్, యాక్షన్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. మరోసారి త్రివిక్రమ్ తన మార్క్ డైలాగ్స్, స్టొరీ, స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నాడు. విడుదలైన అన్ని చోట్లా పాజిటీవ్ టాక్ తో దూసుకెళుతోంది.
 
అల వైకుంఠపురంలో సినిమా నైజాం, వైజాగ్ , కృష్ణ , వెస్ట్ , సీడెడ్ , గుంటూరు , నెల్లూరు వంటి ఏరియాల్లో నాన్ బాహబలి 2 రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. 3వ రోజు షేర్ కి 8 ఏరియాలు, 4వ రోజు షేర్ కి 7 ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చెయ్యడం విశేషం. ఓవర్సీస్ లో విడుదలైన చిత్రాల్లో అల వైకుంఠపురంలో నెంబర్ 1 స్థానంలో దూసుకెళుతోంది, ఈ శుక్రవానికి 2 మిలియన్ క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పండక్కి విడుదలైన చిత్రాల్లో టికెట్స్ దొరకడం లేదని పబ్లిక్ అనుకుంటున్నారు. సంక్రాంతి సినిమాల్లో టిక్కెట్లు దొరకనంతగా హౌస్ ఫుల్స్ అవ్వడం అల వైకుంఠపురం చిత్రానికే సాధ్యం అయ్యింది.

More News

ర‌ష్మిక ఇంటిపై ఐటీ సోదాలు

ప్ర‌స్తుతం అగ్ర క‌థానాయిక‌గా టాలీవుడ్‌లో రాణిస్తున్న క‌న్న‌డ క‌థానాయ‌కి ర‌ష్మిక మంద‌న్న‌. ఈ సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వ‌రుతో మ‌రో సూప‌ర్‌హిట్ చిత్రాన్నిన త‌న ఖాతాలో వేసుకుంది.

‘యజమాని ఆజ్ఞాపిస్తేనే బీజేపీ చుట్టూ ప్యాకేజీ స్టార్’

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జనసేన కీలక ప్రకటన.. ఎల్లుండి ఏం జరగబోతోంది!?

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైసీపీ కార్యకర్తలు, నేతల దాడిలో గాయపడిన కార్యకర్తలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన..

'ఎంత మంచివాడ‌వురా' త‌ప్ప‌కుండా అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌కు నచ్చుతుంది - స‌తీశ్ వేగేశ్న‌

జాతీయ అవార్డ్ ద‌క్కించుకున్న శ‌త‌మానం భ‌వ‌తి వంటి చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న‌. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `ఎంత మంచివాడ‌వురా`.

మళ్లీ రిపీట్ అయితే చూస్తూ కూర్చోం.. : పవన్ వార్నింగ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైసీపీ కార్యకర్తలు, నేతల దాడిలో జనసేన కార్యకర్తలు గాయపడ్డ సంగతి తెలిసిందే.