దూసుకెళ్తున్న 'అల వైకుంఠపురంలో’ పాట

  • IndiaGlitz, [Saturday,October 19 2019]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న ‘అల వైకుంఠపురంలో’ని మొదటిపాట ‘సామజవరగమన’ విడుదల అయిన విషయం విదితమే.. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రచించిన ఈ గీతానికి తమన్ స్వరాలు సమ్మోహన పరుస్తున్నాయి. గాయకుడు సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ప్రస్తుతం విశేష ఆదరణకు నోచుకుంటోంది.

ఈ పాట విడుదలైన 24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్ , 313 లైక్స్ రావడం విశేషం. తెలుగులో మొదటిసారి ఫస్ట్ సింగల్ కు ఇన్ని వ్యూస్, లైక్స్ రావడం హర్షించదగ్గ విషయం.సామజవరగమన సాంగ్ విడుదలైన మొదటి 35 నిమిషాల్లో 50 వేల లైక్స్, 88 నిమిషాలకు 1 లక్ష లైక్స్, మూడు గంటల 7 నిమిషాలకు లక్ష 50 వేల లైక్స్, 6 గంటల 12 నిమిషాలకు 2 లక్షల లైక్స్, 10 గంటల 22 నిమిషాలకు 2 లక్షల 50 వేల లైక్స్, 22 గంటల 5 నిమిషాలకు 3 లక్షల లైక్స్ రావడం విశేషం. అలాగే ఇప్పటివరకు ఈ పాటకు 40 మిలియన్స్ వ్యూస్, 7 లక్షల లైక్స్ వచ్చాయి. తెలుగులో ఒక సాంగ్ కు ఇన్ని లైక్స్ , వ్యూస్ రావడం ఇదే ప్రధమం.

‘అల వైకుంఠపురములో” ని తారలు: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,పూజ హెగ్డే,టబు,రాజేంద్రప్రసాద్,సచిన్ ఖేడ్ కర్,తనికెళ్ళ భరణి,మురళీ శర్మ, సముద్ర ఖని,జయరాం,సునీల్,నవదీప్,సుశాంత్,నివేతా పేతురాజ్,గోవిందా పద్మసూర్య,రోహిణి,ఈశ్వరీరావు,కల్యాణినటరాజన్,శిరీష,బ్రహ్మాజీ,హర్షవర్ధన్,అజయ్, పమ్మిసాయి,రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.