'అలా మొద‌లైంది' త‌రువాత మ‌రోసారి..

  • IndiaGlitz, [Thursday,March 31 2016]

పెర్‌ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న‌ పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటున్న న‌టి నిత్యా మీన‌న్‌. రాశి కంటే వాసికే ప్రాధాన్య‌మిచ్చే న‌టిగా ఈ కేర‌ళ కుట్టి పేరు తెచ్చుకుంది. అలాంటి నిత్యా తెలుగులో న‌టించిన తొలి చిత్రం 'అలా మొద‌లైంది'. ఆ సినిమా ఆమెకి మ‌రిన్ని మంచి అవ‌కాశాల‌తో పాటు నంది అవార్డుని సైతం అందించింది. విశేష‌మేమిటంటే.. ఆ సినిమాలో నిత్యా మీన‌న్ పాత్ర పేరు నిత్యా నే కావ‌డం. మ‌ళ్లీ తెలుగులో ఆమె అదే పేరుతో మ‌రో సినిమాలో సంద‌డి చేయ‌నుంది. 'ఏమిటో ఈ మాయ' గా కొన్నాళ్ల క్రితం వార్త‌ల్లో వినిపించిన ఆమె ద్విభాషా చిత్ర‌మొక‌టి.. 'రాజాధిరాజా 'గా ఇప్పుడు పేరు మార్చుకుని ఏప్రిల్ 1న రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే.

శ‌ర్వానంద్ హీరోగా న‌టించిన ఈ సినిమాలో నిత్యా త‌న పాత్ర పేరుతో మ‌రోసారి సంద‌డి చేయ‌నుంది. 'మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు' త‌రువాత త‌న‌కు క‌లిసొచ్చిన క‌థానాయ‌కుడుతోనూ.. 'అలా మొద‌లైంది' త‌న‌కు క‌లిసొచ్చిన పాత్ర పేరుతోనూ నిత్యా న‌టిస్తున్న ఈ ఫీల్ గుడ్ మూవీ ఆమెకి మ‌రో విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి.