లారెన్స్‌తో వివాదంపై స్పందించిన అక్షయ్
Send us your feedback to audioarticles@vaarta.com
కొరియోగ్రాఫర్, నటుడు, నిర్మాత, దర్శకుడు రాఘవ లారెన్స్ తెరకెక్కించిన కామెడీ హారర్ జోనర్ సిరీస్ కాంచన ఇప్పుడు బాలీవుడ్లో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కాంచన సినిమాను `లక్ష్మీబాంబ్` పేరుతో రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా మేకింగ్‌లో లారెన్స్, నిర్మాతలకు మధ్య పెద్ద గొడవే జరిగింది. తన అనుమతి తీసుకోకుండా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడంపై లారెన్స్ సీరియస్ అయ్యాడు. తాను సినిమా నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే రంగంలోకి దిగిన అక్షయ్ కుమార్ వ్యవహారాన్ని చక్కపెట్టాడు. దాంతో మళ్లీ సినిమా చిత్రీకరణ చేయడానికి లారెన్స్ ఒప్పుకున్నాడు. సినిమా చిత్రీకరణ జరగుతుంది. ఈ చిత్రం మే నెలలో విడుదల కానుంది. ఈ వ్యవహారంపై తొలిసారిగా అక్షయ్ కుమార్ స్పందించారు.
``లారెన్స్‌కి, నిర్మాతలకు మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. సమస్యను పరిష్కరించుకున్నారు. తర్వాత ఎవరూ దీనిపై నోరు మెదపలేదు. సినిమా అంతా షెడ్యూల ప్రకారమే జరుగుతుంది. హారర్, థ్రిల్లర్ జోనర్ గురించి బాగా తెలిసిన దర్శకుడు లారెన్స్. సినిమాలో పాత్ర కోసం చీరలు కట్టుకుని నటిస్తుండటం కొత్తగా ఉంది. ట్రిక్‌తో కూడుకున్న సన్నివేశాల్లో నటిస్తున్నాను`` అన్నారు అక్షయ్. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గాన టిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout