చిరుతో అక్షయ్..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఖైదీ నంబర్ 150 చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఈ చిత్రం సక్సెస్‌తో గ్రాండ్ రీఎంట్రీ కొట్టాడు. ఇప్పుడు చిరంజీవి 151వ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. భారతదేశ్వ స్వాతంత్ర్యంలో భాగంగా బ్రిటీష్ వారిని ఎదిరించిన తెలుగు తేజం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథతో చిరు 151వ సినిమా ఉంటుంది. ఈ సినిమాను సురేందర్‌రెడ్డి డైరెక్ట్ చేస్తాడు. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా ఓకే అయ్యినట్టే.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అందులో భాగంగా చిత్ర యూనిట్ ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌ను సంప్రదించారని వార్తలు వినపడుతున్నాయి. బాలీవుడ్ సూపర్‌స్టార్ అయిన అక్షయ్‌కుమార్ రజనీకాంత్ రోబో సీక్వెల్ 2.0తో దక్షిణాదిన తెరంగేట్రం చేశాడు. ఇప్పుడు చిరు సినిమాకు ఓకే చెబుతాడా..అక్షయ్ అడిగినంత రెమ్యునరేషన్ చరణ్ ఇస్తాడా..అంతా ఓకే అయితే అక్షయ్ నటిస్తాడనే అనుకోవాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com