బియర్ గ్రిల్స్.. ఇప్పుడు అక్షయ్ వంతు
Send us your feedback to audioarticles@vaarta.com
డిస్కవరీ ఛానెల్‌ను చాలా మంది ప్రేక్షకులు ఇష్టపడి చూస్తుంటారు. అటువంటి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సదరు ఛానెల్ చేపట్టిన కార్యక్రమమే ఇన్ టు ది వరల్డ్. ఈ కార్యక్రమంలో సినీ సెలబ్రిటీలు పాల్గొనడమే ప్రత్యేకత. బియర్ గ్రిల్స్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈయన అటు దక్షిణాది, ఇటు ఉత్తరాది సినీ స్టార్స్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుడటంతో దీనికి మరింత క్రేజ్ పెరిగింది. ఇప్పటికే మనదేశం నుండి ప్రధాని నరేంద్రమోదీ, సూపర్‌స్టార్ రజినీకాంత్‌లు పాల్గొన్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా పాల్గొనడం విశేషం.
ఈ కార్యక్రమంలో తాను పాల్గొన్నట్లు అక్షయ్ కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. టీజర్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన అక్షయ్.. ‘మీరు నాకు పిచ్చి అనుకోవచ్చు.. కానీ పిచ్చి ఉన్న వాళ్లే ఇంత దట్టమైన అడవిలోకి వెళ్లగలుగుతారు’ అంటూ టీజర్‌తో పాటు క్యాప్షన్ కూడా జోడించారు అక్షయ్. కర్ణాటకలోని బందీపూర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్షయ్ కుమార్‌పై చిత్రీకరణ జరిగింది. ఒకరోజు పాటు షూటింగ్ జరిగిందని సమాచారం. అక్షయ్ పాల్గొనబోయే ఇన్ టు ది వైల్డ్ కార్యక్రమం సెప్టెంబర్ 11, సెప్టెంబర్ 14 తేదీల్లో ప్రసారమవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments