సౌత్ సినిమాలు బెస్ట్ : అక్షయ్

  • IndiaGlitz, [Tuesday,August 01 2017]

బాలీవుడ్ హీరో అక్ష‌య్‌కుమార్ ద‌క్షిణాది సినిమాల గురించి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. ఈ ఏడాది బాలీవుడ్ సినిమాల కంటే టాలీవుడ్ సినిమాల స‌క్సెస్ రేట్ బావుంది. అక్ష‌య్‌కుమార్ న‌టించిన టాయ్‌లెట్‌కి ఏక్ ప్రేమ్ క‌థ సినిమా ఆగ‌స్ట్ 11న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి.

ఈ సంద‌ర్భంగా అక్ష‌య్ మాట్లాడుతూ ఈ ఏడాది సౌత్ సినిమాలే బెస్ట్‌. ద‌క్షిణాదిలో సినిమా పబ్లిసిటీకి రెండు కోట్ల కంటే ఎక్కువ‌గా ఖ‌ర్చుచేయ‌రు. ఓ ప్లానింగ్‌లో సినిమాల‌ను విడుద‌ల చేసుకుంటారు. మంచి సినిమానే బాక్సాఫీస్ వ‌ద్ద ఆడుతుందని బాగా న‌మ్ముతారని అన్న అక్ష‌య్ బాహుబ‌లి2తో త‌న సినిమాను పోల్చ‌వ‌ద్ద‌ని తెలిపారు.