'2.0' లో యాక్ట్ చేయడం వల్ల ఓపిక పెరిగింది: అక్షయ్ కుమార్
Send us your feedback to audioarticles@vaarta.com
స్టార్ డైరెక్టర్ శంకర్ బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్‌ను నెగటివ్ హీరోను చేసేశాడు. 2.0 చిత్రంలో చిట్టికి ధీటుగా పోటీ ఇచ్చే విలన్ పాత్రలో అక్షయ్‌కుమార్ తెరపై కనపడనున్నాడు. అక్షయ్ ఫస్ట్‌లుక్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. ఇప్పటి వరకు తాను 2.0లో మేకప్ వేసుకున్నంతగా ఏ సినిమాలో వేసుకోలేదని, మేకప్ వేసుకోకుండానే నటించడానికి ఆసక్తి చూపను.
కానీ ఈ సినిమాలో మేకప్ వేసుకోవడానికి ప్రతిరోజూ మూడు గంటల సమయం పట్టింది. అలాగే మేకప్ తీయడానికి ఒక గంట సమయం పట్టేది. పాత్ర పరంగా చాలా కష్టపడ్డాను. కానీ ఇంత మంచి ప్రాజెక్ట్‌లో పార్ట్ కావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అంతే కాకుండా సాధారణంగా నాకు ఓపిక కాస్తా ఎక్కువే. అయితే 2.0లో మేకప్ వేసుకోవడం, యాక్ట్ చేయడం వల్ల ఆ ఓపిక ఇంకా పెరిగిందని అక్షయ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com