మోదీని ఇంటర్వ్యూ చేసిన అక్షయ్ కుమార్
Send us your feedback to audioarticles@vaarta.com
''నేను ప్రధాన మంత్రి అవుతానని అసలు ఊహించలేదు. ప్రధాని కావాలని నేనెప్పుడూ కలగనలేదు. కుటుంబ ప్రమేయంతో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాను. సైన్యంలో చేరి దేశసేవ చేయాలనుకున్నా. నేను క్రమశిక్షణ గల కార్యకర్తను. నేనే కఠినంగా ఉంటాను.. తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని మాత్రం అనుకోను'' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా.. మోదీ ఈ వ్యాఖ్యలు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో 7లోక్ కల్యాణ్ మార్గ్‌లో ప్రధాని నరేంద్రమోదీతో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్తిగా రాజకీయాలకు సంబంధం లేని అంశాలపై చర్చించారు. అక్షయ్ అడిగిన ప్రశ్నలకు మోదీ ఆసక్తికర సమాధానాలు చెప్పారు. కాగా ఈ ఇంటర్వ్యూ ప్రోమోను అక్షయ్ తన ట్విట్టర్లో షేర్ చేశారు.
టీజర్లో ఏముంది..!?
మీకెప్పుడూ మీ అమ్మతో ఉండాలని, మీ సోదరులు, మీ బంధువులందరూ మీ ఇంట్లో మీతో ఉండాలని ఉండదా? అని అక్షయ్ ప్రశ్నించగా మోదీ స్పందిస్తూ తాను జీవితంలో చాలా చిన్నతనంలోనే వీటన్నింటినీ వదిలేశానన్నారు. చాలా చిన్న వయసులో మా అమ్మ నాతో అనేది.. నువ్వు నా వెనక తిరిగి ఎందుకు సమయం వృథా చేసుకుంటున్నావు? అని చెప్పేది అని మోదీ ఒకింత ఆవేదనతో చెప్పారు. ఇలా.. ఇంటర్వ్యూలో అక్షయ్ అడిన ప్రతీ ప్రశ్నకు మోదీ ఆసక్తికరంగా సమధానమిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments