రానా, మిహికల పెళ్లిపై అక్షయ్ ఆసక్తికర ట్వీట్..
Send us your feedback to audioarticles@vaarta.com
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లిస్టు నుంచి రానా అవుట్ పోతున్నాడు. శనివారం రాత్రి 8:30 గంటలకు తన ప్రియురాలు మిహికను వివాహం చేసుకోబోతున్నాడు. కరోనా కారణంగా ఈ వివాహానికి అతికొద్ది మంది అతిథులు మాత్రమే హాజరవుతున్నారు. హాజరు కాలేని వారు సోషల్ మీడియా ద్వారా రానాకు విషెస్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
రానా శాశ్వతంగా లాక్డ్ డౌన్‌లోకి వెళుతున్నాడంటూ పేర్కొంటూ విషెస్ తెలిపారు. `శాశ్వతంగా లాక్డ్-డౌన్ కావడానికి ఇదే సరైన మార్గం. కంగ్రాట్స్ రానా.. మీరిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాన`ని అక్షయ్ ట్వీట్ చేశారు. రానా మిహికా బజాజ్‌ల వివాహం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరగనుంది.
Perfect way to get permanently locked-down :) Congratulations @RanaDaggubati , wishing you both a lifetime of happiness ♥️ https://t.co/asr7d0Vrf2
— Akshay Kumar (@akshaykumar) August 8, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments