రోబో సీక్వెల్ లో అక్ష‌య్ లుక్ లీక్..

  • IndiaGlitz, [Wednesday,March 23 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందిన రోబో చిత్రం ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో అంద‌రికీ తెలిసిందే. ఈ సంచ‌ల‌న చిత్రానికి సీక్వెల్ గా రోబో 2.0 తెర‌కెక్కుతుంది. ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ కోసం హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ని ట్రై చేసాడు శంక‌ర్. కానీ శంక‌ర్ ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. ఫైన‌ల్ గా రోబో సీక్వెల్ లో నెగిటివ్ రోల్ ను బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ తో చేయిస్తున్నారు.

ఈ విష‌యం తెలిసిన‌ప్ప‌టి నుంచి రోబో 2.0 లో అక్ష‌య్ కుమార్ రోల్ ఎలా ఉంటుంది..? గెట‌ప్ ఎలా ఉంటుంది..? అనే ఆస‌క్తి ఏర్ప‌డింది. అయితే ఆడియోన్స్ లో ఏర్ప‌డిన ఈ ఆస‌క్తికి తెర‌దించేలా రోబో సీక్వెల్ లో అక్ష‌య్ లుక్ లీక్ అయ్యింది. వెన‌క్కి దువ్విన వైట్ హెయిర్..పొడుగుగా ఉన్న క‌నుబొమ్మ‌లు..రాక్ష‌సుడిలా దంతాలు ఉన్న కొత్త‌లుక్ లో అక్ష‌య్ స్టిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అస‌లు అక్ష‌య్ కుమారేనా అనిపించేలా చాలా డిఫ‌రెంట్ గా ఉంది ఈ లుక్. ప్ర‌స్తుతం చెన్నైలోని ఫిరోజ్ షా మైదానంలో యాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌రిస్తున్నారు. మ‌రో రెండు వారాలు ఇక్క‌డే షూటింగ్ చేయ‌నున్నారు. అక్ష‌య్ లుక్కే ఇంత డిఫ‌రెంట్ గా ఉంటే...క్యారెక్ట‌ర్ ఇంకెంత డిఫ‌రెంట్ గా ఉంటుందో..?