ఆమిర్ కోసం అక్షయ్ సినిమా వాయిదా
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ స్టార్, మిత్రుడు ఆమిర్ ఖాన్ కోసం మరో బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ వెనక్కి తగ్గాడు. అందులో భాగంగా ఆయన తన సినిమా బచ్చన్ పాండే విడుదలను వాయిదా వేసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. ఆమిర్ ఖాన్, అద్వైత్ చందన్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం `లాల్ సింగ్ చద్దా`. హాలీవుడ్ చిత్రం `ఫారెస్ట్ గంప్`కు ఇది రీమేక్. ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్‌కు విడుదల చేయాలనుకున్నాడు. అదే సమయంలో అక్షయ్‌కుమార్ తన సినిమా `బచ్చన్ పాండే`ను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.
రెండు సినిమాలు ఒకేసారి విడుదలైతే కలెక్షన్స్ పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని భావించిన ఆమిర్ ఖాన్.. హీరో అక్షయ్‌కుమార్, నిర్మాత నడియడ్ వాలాతో ప్రత్యేకంగా ఫోన్‌లోమాట్లాడారు. ఆమిర్‌ఖాన్ మాట్లాడిన తర్వాత అక్షయ్ తన సినిమా `బచ్చన్ పాండే`ను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అక్షయ్ ఏకధాటిగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. గత ఏడాది కేసరి, మిషన్ మంగళ్, హౌస్‌ఫుల్ 4, గుడ్ న్యూస్ చిత్రాలు విడుదలై ఘన విజయాన్ని సాధించాయి. ఇక ఈ ఏడాది 27 మార్చిన `సూర్యవంశీ` విడుదల కానుంది. వచ్చే ఏడాది మే 22న లక్ష్మీబాంబ్ విడుదల కానున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com