స్టార్ హీరో అక్షయ్ 25 కోట్ల భారీ విరాళం

దేశవ్యాప్తంగా కరోనా ముప్పు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ‘పీఎం కేర్స్ ఫండ్’ ఏర్పాటు చేశారు. కరోనాపై పోరుకు, సహాయక చర్యలకు ఉపయోగపడేలా విరాళాలు ఇవ్వదలిచిన వారికి ఇది వేదికగా నిలుస్తుందని మోదీ పిలుపునిచ్చారు. కరోనాపై యుద్ధానికి భారతీయులందరూ ‘పీఎం కేర్స్ ఫండ్’ కు విరివిగా విరాళాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అంతేకాదు.. చిన్నమొత్తాలు అయినా సరే విరాళాలుగా అందించవచ్చని మెదీ స్పష్టం చేశారు. ఈ మేరకు ‘పీఎం కేర్స్ ఫండ్’ బ్యాంకు అకౌంట్ వివరాలు కూడా మోదీ తన ట్విట్టర్‌లో పంచుకున్నారు.

భారీ విరాళం..

మోదీ ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్పందించి.. భారీ విరాళం ప్రకటించారు. తాను రూ.25 కోట్ల విరాళం ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా అక్షయ్ ప్రకటించారు. ‘ఇప్పుడు ప్రతి విషయం దేశ ప్రజల ప్రాణాలకు సంబంధించినదే. మనవాళ్ల కోసం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. నావంతుగా నేను పొదుపు చేసిన డబ్బు నుంచి పాతిక కోట్ల రూపాయలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నాను. మనం ప్రాణాలను కాపాడుదాం. ప్రాణాలుంటేనే జీవించగలం’ అని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. ఇందుకు మోదీ కూడా స్పందించి గ్రేట్ అని ప్రశంసించారు.

More News

కోటి రూపాయిలిచ్చి ‘కింగ్’ అనిపించుకున్న నాగ్..

కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి, దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

చ‌ర‌ణ్ త‌దుప‌రి ద‌ర్శ‌కుడు అత‌నేనా?

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా ‘రౌద్రం ర‌ణం రుధిరం’లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్

రాజ‌మౌళి చిత్రంలో మ‌రో సూపర్ స్టార్ ?

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో తెర‌కెక్కిస్తోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’. ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌గా

తార‌క్ అన్నీ భాష‌ల్లో డ‌బ్బింగ్ చెబుతాడు..!

‘రౌద్రం ర‌ణం రుధిరం’ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. అందుకు ప్ర‌త్యేక కార‌ణాలు చెప్ప‌న‌క్క‌ర్లేదు. ‘బాహుబ‌లి’ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది.

ఇండియాలో ఫస్ట్ టైమ్ కోవిడ్-19 మైక్రోస్కోపీ చిత్రం

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. అక్కడెక్కడో చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది. మరోవైపు చైనా, అమెరికా, ఇటలీ లాంటి దేశాల్లో రోజురోజుకూ కరోనా