పబ్-జి ప్లేస్‌లో ఫౌ-జిని తీసుకొచ్చిన అక్షయ్..
Send us your feedback to audioarticles@vaarta.com
భారత్‌లో ప్రభుత్వం కొన్ని యాప్స్‌ను నిషేధించడంతో స్వదేశీ డెవలపర్స్‌కి మంచి అవకాశం దొరికనట్టైంది. మొదట టిక్‌టాక్ సహా 59 యాప్‌లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే స్వదేశీ డెవలపర్స్‌కు ప్రధాని మోదీ మంచి అవకాశం ఇచ్చారు. దీంతో స్వదేశీ డెవలపర్స్ అంతా తమను తాము నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం పబ్-జి సహా మరికొన్ని యాప్స్‌పై కేంద్రం నిషేధం విధించింది.
భారత్‌లో విస్తృత ఆదరణ పొందిన పబ్-జి గేమ్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో స్వదేశీ డెవలపర్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో ‘ఎన్ కోర్ గేమ్స్’ అనే సంస్థ తాజాగా ‘ఫియర్‌లెస్ అండ్ యునైటెడ్: గార్డ్స్(FAU:G)’ పేరుతో ఓ యాక్షన్ గేమ్‌ను రూపొందించింది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నేతృత్వంలో ఈ గేమ్ రూపొందింది. ప్రధాని నరేంద్రమోదీ ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తితో ఈ గేమ్‌ను రూపొందించినట్టు డెవలపర్స్ తెలిపారు.
ఈ గేమ్ గురించి తాజాగా అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. ‘‘ప్రధాని నరేంద్రమోదీ `ఆత్మనిర్భర్ భారత్` స్ఫూర్తితో ‘ఫియర్‌లెస్ అండ్ యునైటెడ్: గార్డ్స్(FAU:G)’ అనే యాక్షన్ గేమ్‌ను సగర్వంగా ప్రకటిస్తున్నాను. ఈ గేమ్ ఆడడం ద్వారా వినోదం మాత్రమే కాకుండా, మన సైనికుల త్యాగాల గురించి కూడా ఆ గేమ్ ఆడేవాళ్లు తెలుసుకునే అవకాశం ఉంది. ఈ గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం ‘భారత్ కా వీర్’ ట్రస్టుకు అందుతుంది’’ అని అక్షయ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ గేమ్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments