పబ్-జి ప్లేస్‌లో ఫౌ-జిని తీసుకొచ్చిన అక్షయ్..

భారత్‌లో ప్రభుత్వం కొన్ని యాప్స్‌ను నిషేధించడంతో స్వదేశీ డెవలపర్స్‌కి మంచి అవకాశం దొరికనట్టైంది. మొదట టిక్‌టాక్ సహా 59 యాప్‌లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే స్వదేశీ డెవలపర్స్‌కు ప్రధాని మోదీ మంచి అవకాశం ఇచ్చారు. దీంతో స్వదేశీ డెవలపర్స్ అంతా తమను తాము నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం పబ్‌-జి సహా మరికొన్ని యాప్స్‌పై కేంద్రం నిషేధం విధించింది.

భారత్‌లో విస్తృత ఆదరణ పొందిన పబ్-జి గేమ్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో స్వదేశీ డెవలపర్స్‌ ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో ‘ఎన్ కోర్ గేమ్స్’ అనే సంస్థ తాజాగా ‘ఫియర్‌లెస్ అండ్ యునైటెడ్: గార్డ్స్(FAU:G)’ పేరుతో ఓ యాక్షన్ గేమ్‌ను రూపొందించింది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నేతృత్వంలో ఈ గేమ్ రూపొందింది. ప్రధాని నరేంద్రమోదీ ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తితో ఈ గేమ్‌ను రూపొందించినట్టు డెవలపర్స్ తెలిపారు.

ఈ గేమ్ గురించి తాజాగా అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. ‘‘ప్రధాని నరేంద్రమోదీ 'ఆత్మనిర్భర్ భారత్' స్ఫూర్తితో ‘ఫియర్‌లెస్ అండ్ యునైటెడ్: గార్డ్స్(FAU:G)’ అనే యాక్షన్ గేమ్‌ను సగర్వంగా ప్రకటిస్తున్నాను. ఈ గేమ్ ఆడడం ద్వారా వినోదం మాత్రమే కాకుండా, మన సైనికుల త్యాగాల గురించి కూడా ఆ గేమ్ ఆడేవాళ్లు తెలుసుకునే అవకాశం ఉంది. ఈ గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం ‘భారత్ కా వీర్’ ట్రస్టుకు అందుతుంది’’ అని అక్షయ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ గేమ్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

More News

ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది.

క్రిష్ సినిమాకు ఆధారం అదేనా..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పీరియాడిక్ మూవీ స్టార్ట్ చేసిన జాగ‌ర్ల‌మూడి క్రిష్‌కు క‌రోనా వైర‌స్ పెద్ద షాకే ఇచ్చింది. షూటింగ్ ఆపేశాడు.

'వేయి శుభములు కలుగు నీకు' సినిమా టీజర్ ను విడుదల చేసిన హీరో సునీల్

జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజా  మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్ గా రామ్స్ రాథోడ్ దర్శకత్వం లో

శిరోముండనం కేసులో నూతన్ నాయుడు అరెస్ట్.. షాకింగ్ న్యూస్ చెప్పిన సీపీ

విశాఖ శిరోముండనం కేసులో సినీ నిర్మాత, బిగ్‌బాస్ ఫేం నూతన్‌నాయుడని పోలీసులు అరెస్ట్ చేశారు.

సుశాంత్ సీబీఐ ద‌ర్యాప్తుపై విజ‌య‌శాంతి సూటి ప్ర‌శ్న‌

బాలీవుడ్ యువ క‌థానాయ‌కుడు సుశాంత్ సింగ్ మ‌ర‌ణం త‌ర్వాత అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడని అంద‌రూ అనుకుంటే..