శర్వానంద్ తో అక్ష..

  • IndiaGlitz, [Monday,July 25 2016]

రన్‌రాజారన్‌, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, ఎక్స్‌ప్రెస్‌ రాజా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో హ్యాట్రిక్‌ సాధించిన హీరో శర్వానంద్‌ కథానాయకుడిగా, భలే భలే మగాడివోయ్‌, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి కథానాయికగా, ఛత్రపతి, డార్లింగ్‌, అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఓ భారీ చిత్రాన్నిరూపొందుతున్న సంగతి తెలిసిందే.

భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'డార్లింగ్‌' చిత్రానికి కరుణాకరన్‌ వద్ద అసోసియేట్‌గా వర్క్‌ చేసిన చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో శ‌ర్వానంద్ స‌ర‌స‌న మ‌రో హీరోయిన్‌గా అక్ష న‌టిస్తుందని స‌మాచారం. డిక్టేట‌ర్ త‌ర్వాత అక్ష తెలుగులో చేస్తున్న చిత్ర‌మిది.

More News

ఇప్పుడు సూర్య అవకాశం ఇస్తాడంటారా?

సూపర్ స్టార్ రజనీకాంత్ తో కబాలి సినిమాను రూపొందించిన దర్శకుడు పా రంజిత్ కు విడుదలకు ముందు ఉన్న క్రేజే వేరు. విడుదల తర్వాత ప్రశంసలు ఎన్ని వచ్చాయో, విమర్శలు కూడా అన్నే వచ్చాయి.

మంచు హీరోతో ఆమె చేయడం లేదు....

`కంచె`తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సీతాదేవిగా చెరగని ముద్రవేసుకున్న ప్రగ్యాజైశ్వాల్కు ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రానున్న'ఓం నమో వెంకటేశాయ' చిత్రంలో నటిస్తుంది.

అవసరాలతో రెజీనా..?

నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్న అవసరాల శ్రీనివాస్ ఇప్పుడు ఓ బాలీవుడ్ చిత్రంలో నటించనున్నాడు. `హంటర్` అనే బాలీవుడ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నవీన్ మేడారం తెరకెక్కిస్తారని అంటున్నారు.

కన్నడ రీమేక్ లో ఆది...

ఆగస్ట్ 5న `చుట్టాలబ్బాయి`గా తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి హీరో ఆది, తండ్రితో సాయికుమార్తో కలిసి రెడీ అయిపోయాడు. ఈ సినిమా తర్వాత హీరో ఆది తన తదుపరి చిత్రంగా కన్నడ ఘన విజయం సాధించిన `ఫస్ట్ ర్యాంక్ రాజ్` చిత్రాన్ని రీమేక్ లో నటించనున్నాడట.

వెంకటేష్ ను బాబు...బంగారం అని ఇప్పుడు అంటున్నారు కానీ...నేను ఆరోజే చెప్పాను - దర్శకరత్న దాసరి

విక్టరీ వెంకటేష్-యువ దర్శకుడు మారుతి కాంబినేషన్లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బాబు బంగారం.ఈ చిత్రంలో వెంకటేష్ సరసన అందాలతార నయనతార నటించింది.