"అక్రమ్" మూవీ టీజర్ రిలీజ్ ఫంక్షన్
Send us your feedback to audioarticles@vaarta.com
విజయవాడ: నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అచ్చ తెలుగు నేలపై... హాలీవుడ్ తరహాలో నిర్మిoచబడిన సినిమా "అక్రమ్". ఈ సినిమా టీజర్ రిలీజ్ ఫంక్షన్ విజయవాడలోని ఒక స్టార్ హోటల్ లో ఘనంగా జరిగింది.
మేడిది సురేష్ హీరోగా డాన్ నేపథ్యంలో సాగే అక్రమ్ సినిమాపై ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ నడుస్తోంది. పూర్తిగా అమరావతి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా తీస్తున్నారు. అమరావతిని ఏపీ సిఎం చంద్రబాబు ప్రపంచ దేశాలు నివ్వెరపోయేలా నిర్మించే ప్రయత్నంలో ఉండగా, ఇక్కడ రాజధాని "అమరావతి మూవీస్" బ్యానర్ పై "అక్రమ్" చిత్రం అంతర్జాతీ స్థాయి ప్రమాణాలతో హాలీవుడ్ తరహాలో రూపొందుతోంది. సినిమా నిర్మాణ సమయంలోనే...అశేషంగా, విశేషంగా ప్రజాదరణ పొందుతోంది.
సినీ అభిమానుల అందరి నోటా ఒకటే మాట... అసలు ఎవరీ అక్రమ్? ఆయన చూపు ఇపుడు ఈ స్టేట్ పై ఎందుకు పడింది... ఈ డాన్ ఏం చేయబోతున్నాడు... తెలుగు సినీ ఇండస్ట్రీని ఎలా కుదిపేయబోతున్నాడు... ఇదే ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. అన్నారు... టీజర్ రిలీజ్ చేసిన ప్రముఖ సినీ నిర్మాత అంబికా కృష్ణ. అమరావతిలో నిర్మిస్తున్న తొలి యాక్షన్ చిత్రమిదని, టీజర్ చూస్తే అక్రమ్ సురేష్ టాలీవుడ్ ని షేక్ చేస్తాడనిపిస్తోందన్నారు.
హీరో మాట్లాడుతూ...
డాన్ అక్రమ్ స్టయిలే డిఫరెంట్... డాన్ అక్రమ్ ని చూస్తే, ఎవరికైనా కళ్ళు డేజిల్ కావాల్సిందే... హార్లీ డేవిడ్ సన్ నైట్ రాడ్ బైక్ పై దూసుకొస్తూ... గోల్డ్ కార్లో ప్రత్యర్థుల్ని ఛేజ్ చేస్తూ, అత్యాధునిక ఆయుధాలను వాడే అక్రమ్ ని చూస్తే, ఎవరైనా స్టన్ కావాల్సిందే. హార్లీ డేవిడ్ సన్ నైట్ రాడ్ బైక్ పై దూసుకొస్తూ... గోల్డ్ కార్లో ప్రత్యర్థుల్ని ఛేజ్ చేస్తూ, అత్యాధునిక ఆయుధాలను వాడే అక్రమ్ ప్రేక్షకులకు నచ్చుతాడు. రిలీజ్ ఫంక్షన్ కు రావడం కూడా డాజిలింగ్ గానే సాగింది. డాన్ అక్రమ్ గోల్డ్ కారులో విజయవాడలో రహదారులపై కాన్వాయిగా హోటల్ డి.వి.మనార్ కు చేరారు. గన్ మెన్ల ఎస్కార్ట్ తో టీజర్ రిలీజ్ ఫంక్షన్ కు చేరారు.
టాలీవుడ్ తలైవా... అక్రమ్ సురేష్: పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు
సభకు అధ్యక్షత వహించిన పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు అక్రమ్ సినిమా టీజర్ ని చూసి హీరో సురేష్ ని అభినందించారు. స్టయిల్ కి సిగ్నేచర్ గా కనిపిస్తున్న అక్రమ్ సురేష్... టాలీవుడ్ తలైవా! అని కొనియాడారు. అక్రమ్ స్టిల్స్ చూస్తే ఎవరికైనా కళ్ళు డేజిల్ కావాల్సిందే అన్నారు. టీజర్ రిలీజ్ ఫంక్షన్లో అక్రమ్ హీరో మేడిది సురేష్, హీరోయిన్ శ్వేత భాత్రియా, దర్శకుడు అనిల్ కుమార్ తో పాటు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు అలంకార్ ప్రసాద్, సంగీత దర్శకుడు ఎం.వి.సాయి, ఆర్ట్ డైరెక్టర్ రవీంద్రన్, చిత్ర సమర్పకులు విస్సాకోటి మార్కండేయులు, నిర్మాత శివకుమారి తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments