నాగచైతన్య - విక్రమ్ కుమార్ ‘‘థాంక్యూ’’ రిలీజ్ డేట్ ఫిక్స్.. పోస్టర్‌లో చైతూ లుక్ వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది లవ్‌స్టోరీ సినిమాతో మంచి హిట్ అందుకున్న అక్కినేని నాగచైతన్య తనకు సూటయ్యే కథలతో దూసుకెళ్తున్నారు. యూత్, ప్రేమ కథలను చేస్తూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంటున్నారు. తాజాగా చైతూ నటించిన మరో సినిమా విడుదలకు సిద్ధమైంది. అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ లాంటి దృశ్య కావ్యాన్ని అందించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతన్య నటించిన ‘థాంక్యూ’ సినిమా విడుదలకు సిద్ధమైంది. జూలై 8న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తామని తెలుపుతూ చిత్ర యూనిట్ శనివారం పోస్టర్ విడుదల చేసింది.
థాంక్యూలో నాగచైతన్య సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బీవీయస్ రవి ఈ సినిమాకు కథ అందించగా పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వున్న థాంక్యూ సినిమాలో నాగచైతన్య హాకీ ప్లేయర్‌గా కనిపించనున్నారని ఫిలింనగర్ టాక్.
థాంక్యూతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా చైతన్య నటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్‌సింగ్ చద్దా చిత్రంలో నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తున్నారు. థాంక్యూ సినిమా విడుదలైన దాదాపు నెల రోజులు తర్వాత అంటే ఆగస్ట్ 11న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా చైతన్య తొలి బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చద్దా విడుదలవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments