Dhootha : అక్కినేని నాగచైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ ‘దూత’ ట్రైలర్ చూశారా.. క్రైమ్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో అదరహో
Send us your feedback to audioarticles@vaarta.com
హిట్టు , ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ప్రయోగాలకు పెద్ద పీట వేస్తూ ముందుకు సాగే నటుల్లో అక్కినేని వారసుడు నాగచైతన్య ఒకరు. ప్రేక్షకులకు వినోదం పంచడమే లక్ష్యంగా ఆయన సినిమాలు చేస్తుంటారు. ఓటీటీల రాకతో వెబ్ సిరీస్‌లకు ప్రజల నుంచి ఆదరణ వస్తుండటంతో స్టారో హీరోలు సైతం వెబ్ సిరీస్‌ల వైపు చూస్తున్నారు. మిడ్ రేంజ్ హీరోలు ఈ మార్కెట్‌లో సత్తా చాటుతున్నారు. దీనిలో భాగంగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య నటించిన వెబ్ సిరీస్ ‘దూత ’. తద్వారా తెలుగు పరిశ్రమలో తొలిసారి వెబ్ సిరీస్ చేసిన హీరోగా చైతూ నిలిచారు.
ఇక క్రైమ్, మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ ‘‘దూత ’’ వెబ్ సిరీస్‌పై భారీ అంచనాలున్నాయి. ఇవాళ నాగచైతన్య పుట్టినరోజు కావడంతో దూత ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో నాగచైతన్య ఓ జర్నలిస్ట్‌గా కనిపిస్తున్నట్లుగా అర్ధమవుతోంది. ఓ మర్డర్ కేసులో ఆయన ఇరుక్కోవడం , అందులోంచి ఎలా బయటపడ్డాడు, ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో దూత వెబ్ సిరీస్ తెరకెక్కింది. శరద్ మరార్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల నిడివితో రానుంది. డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ‘‘దూత’’ స్ట్రీమింగ్ కానుంది. మనం, థ్యాంక్యూ తర్వాత నాగచైతన్య- విక్రమ్ కే కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ‘‘దూత’’ కావడం విశేషం.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నాగచైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో ‘‘తండేల్’’ అనే సినిమా చేస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. సముద్రంలో వేటకెళ్లే మత్స్యకారులు, వారు ఎదుర్కొనే ఇబ్బందుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకార గ్రామాల్లో నాగచైతన్య పర్యటించిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com