మ‌హేశ్ అభిమానిగా మారిన అక్కినేని హీరో..!

  • IndiaGlitz, [Thursday,January 07 2021]

ఇప్పుడున్న యువ హీరోలు అగ్ర క‌థానాయ‌కుల అభిమానులుగా కనిపించ‌డం స‌ర్వ సాధార‌ణ‌మైన విష‌యంగా మారింది. ఒక‌ప్పుడు స్టేజీల‌పై క‌న‌ప‌డే ఈ అభిమానం.. ఇప్పుడు వెండితెర‌పై కూడా పాకింది. ఏదైతేనేం.. ఇదే బాట‌లో ఓ అక్కినేని హీరో అడుగుపెడుతున్నాడు. ఆ హీరో ఎవ‌రో కాదు.. అక్కినేని నాగ‌చైత‌న్య‌. రీసెంట్‌గానే శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ‘ల‌వ్‌స్టోరి’ సినిమాను పూర్తి చేసుకున్న చైత‌న్య ఇప్పుడు ‘థాంక్యూ’ సినిమా షూటింగ్‌తో బిజి బిజీగా ఉన్నాడు. ‘మ‌నం’ వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత చైత‌న్య‌, డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. బీవీఎస్ ర‌వి అందించిన క‌థ‌తో రూపొందుతోన్న మూవీ ఇది.

తాజా స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో చైత‌న్య .. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ అభిమాని పాత్ర‌లో కనిపిస్తాడ‌ని అంటున్నారు. దీనికి సంబంధించిన స‌న్నివేశాల‌ను కూడా రీసెంట్‌గా చిత్రీక‌రిస్తార‌ట‌. ఈ సినిమాలో నాగ‌చైత‌న్య.. అభిరామ్ అనే పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఇది ఓ ర‌కంగా అక్కినేని అభిమానుల‌కే కాదు, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ అభిమానుల‌కు కూడా కిక్కు ఇచ్చే విష‌య‌మే. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More News

కేంద్ర ప్రభుత్వానికే ఝలక్ ఇచ్చిన కేటుగాళ్లు..

కేంద్ర ప్రభుత్వానికి ఝలక్ ఇవ్వాలంటే ఎన్ని గట్స్ ఉండాలి? కానీ ఇచ్చేశారు కొందరు కేటుగాళ్లు.

విజయ్‌ ఫ్యాన్స్‌కు సెంట్రల్‌ షాక్‌.. నిరుత్సాహంలో కోలీవుడ్‌

కోలీవుడ్‌ అగ్ర హీరోల్లో విజయ్‌ ఒకడు. ఈయన సినిమాలకు ఉండే కలెక్షన్సే వేరు. ఆదరణే వేరు. ఈయన లేటెస్ట్‌ మూవీ 'మాస్టర్‌'.

సినిమా ఛాన్స్ కొట్టేసిన అఖిల్ సార్థక్‌!

బిగ్‌బాస్ తెలుగు ఇప్పటికి నాలుగు సీజన్లను కంప్లీట్ చేసుకుంది. అయితే గత మూడు సీజన్ల విషయానికి వస్తే కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ కారణంగా పెద్దగా ఒరిగిందేమీ లేదు.

కేజీఎఫ్ 2: అధీర ఎలా బతికున్నాడు?

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్న ఎంత సెన్సేషన్‌ను క్రియేట్ చేసిందో... ప్రస్తుతం అధీర ఎలా బతికున్నాడు? అనే ప్రశ్న కూడా అంతే సెన్సేషన్‌ను క్రియేట్ చేస్తోంది.

‘ఆచార్య’ టెంపుల్ టౌన్‌ సెట్‌ను చూశారా?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’.