అక్కినేని తండ్రీకొడుకులకు తప్పని పోటీ
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ వేసవిలో తమ కొత్త చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అక్కినేని కుటుంబానికి చెందిన తండ్రీ కొడుకులు నాగార్జున, నాగచైతన్య. అయితే ఈ తండ్రీకొడుకుల సినిమాలతో పాటుగా ఇతర హీరోల సినిమాలు కూడా.. ఆ చిత్రాల విడుదల సమయంలో థియేటర్లలో సందడి చేయనున్నాయి.
కాస్త వివరాల్లోకి వెళితే.. నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఆఫీసర్' చిత్రం మే 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక అదే రోజు కళ్యాణ్ రామ్, తమన్నా జంటగా జయేంద్ర దర్శకత్వం వహించిన 'నా నువ్వే' చిత్రం విడుదల కాబోతుంది.
ఈ చిత్రాల విడుదలకు ఒక్క రోజు ముందు మే 24న మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ 'నేల టికెట్టు'తో సందడి చేయనున్నారు. అలాగే.. నాగచైతన్య, చందు మొండేటి కలయికలో తెరకెక్కుతున్న 'సవ్యసాచి' జూన్ 15న విడుదల కానుండగా.. ఒక్క రోజు ముందు అంటే జూన్ 14న రాజ్ తరుణ్, రిద్ధి కుమార్ జంటగా నటించిన 'లవర్' చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
అదే రోజున యూత్‌ఫుల్ చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన పేరు నిర్ణయించని చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ పోటీ చిత్రాలను ఢీ కొడుతూ.. ఈ తండ్రీ కొడుకులు ఎటువంటి విజయాలను నమోదు చేస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com